Begin typing your search above and press return to search.
బాబు ఘనకీర్తి!... శ్లాబులే కూలుతున్నాయి!
By: Tupaki Desk | 2 March 2019 6:30 AM GMT టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన గురించి, తన పాలన గురించి నిత్యం గొప్పలు చెప్పుకుంటున్న వైనం మనకు కొత్తేమీ కాదు. ఓ వైపు డబ్బులు లేవంటూ బీద ఏడుపులు ఏడుస్తూనే... మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలోని మరే రాష్ట్రంలోనూ జరగడం లేదని చెప్పడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం. ఈ తరహా ఘనకీర్తులను చెప్పుకుంటూ పోతే... ముగింపన్నదే కనబడని పరిస్థితి. అయినా ఇప్పుడు బాబు ఘన కీర్తుల గురించి ఎందుకంటే... నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ కేపిటల్ గా తీర్చిదిద్దుతానంటూ ప్రగల్బాలు పలికిన చంద్రబాబు... తన ఐదేళ్ల పాలనలో అమరావతిలో ఎన్ని నిర్మాణాలు కట్టారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండండే రెండు బిల్డింగులు కడితే... రెండూ కూడా చిన్నపాటి వర్షానికే ఎలా లీకులిచ్చాయో కూడా చూశాం. ఇప్పుడు ఎన్నికల ముందు శాశ్వత హైకోర్టు - శాశ్వత సచివాలయం అంటూ బాబు మరో రెండు నిర్మాణాలకు తెర తీశారు.
ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న నిర్మాణాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏ పాటి నాణ్యత పాటించిందో... ఇప్పుడు శాశ్వత భవనాల పేరిట జరుగుతున్న నిర్మాణాల్లో అంతకంటే కూడా నాసిరకం పనులు సాగుతున్నాయి. ఈ మాట ఏదో విపక్షాల నుంచి వినిపించిన మాట కాదు. సాక్షాత్తు కళ్లెదుటే కనిపిస్తున్న సచిత్ర సాక్ష్యాలు ఈ మాటను చెబుతున్నాయి. శాశ్వత హైకోర్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే హైకోర్టు విజయవాడకు తరలివచ్చిన నేపథ్యంలో పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో తాము ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞాన్ని వాడుతున్నామని బాబు సర్కారు చెబుతున్నా... ఇప్పుడు అక్కడ జరిగిన ఓ చిన్న పాటి ప్రమాదం... బాబు గొప్పల్లో ఏ పాటి నిజముందన్న విషయాన్ని ఇట్టే చెప్పేసిందని చెప్పక తప్పదు. అయినా అక్కడ ఏం జరిగిందన్న విషయానికి వస్తే.. హైకోర్టు నిర్మాణంలో భాగంగా జనరేటర్ ఏర్పాటు కోసం చేపట్టిన కట్టడంలో ఏకంగా శ్లాబు కూలిపోయింది.
నిర్మాణం పూర్తి కాకుండానే వేసిన శ్లాబ్ వేసినట్లే కుప్పకూలడం నిజంగానే ఆశ్చర్యం కగిలించక మానదు. ఎందుకంటే... శ్లాబ్ వేసే ముందు మన దగ్గర పనిచేసే సాధారణ కార్మికులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది బాబు గొప్పగా చెప్పుకునే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న భవన నిర్మాణ రంగంలోని సంస్థ ఇంకెంత జాగ్రత్తలు తీసుకుని ఉండాలి. అయితే జరిగిందేమిటి? జనరేటర్ రూంకు సంబంధించి మొత్తం ఆరు గదులతో కూడిన నిర్మాణానికి శ్లాబ్ వేస్తే... అందులోని నాలుగు గదులకు సంబంధించిన శ్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన పలువురు కార్మికులకు కూడా గాయలయ్యాయి. మరి నిర్మాణం పూర్తయ్యే దాకా గట్టిగానే నిలబడ్డ సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు చిన్నపాటి వర్షానికే కారిపోతే.... నిర్మాణ దశలోనే ఏకంగా శ్లాబ్ కూలిపోయిన హైకోర్టు ఏమేరకు సురక్షితమే బాబే చెప్పాలి.