Begin typing your search above and press return to search.
ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం.. గ్యాంగ్‌స్టర్ సహా నలుగురు మృతి
By: Tupaki Desk | 24 Sep 2021 11:32 AM GMTదేశ రాజధాని దిల్లీ పట్టపగలే కాల్పుల శబ్దాలతో అట్టుడికిపోయింది. దిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో ఓ గ్యాంగ్ స్టర్ లక్ష్యంగా ప్రత్యర్థి గ్యాంగ్ కాల్పులు చేపట్టింది. ఈ ఘటన లో గ్యాంగ్ స్టర్ జితేందర్ అక్కడికక్కడే చనిపోయారు. అయితే అదే సమయంలో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దీనితో ముగ్గురు దుండగులు హతమయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. న్యాయవాది దుస్తుల్లో వచ్చిన దుండగులు.. న్యాయమూర్తి ముందే సుమారు 25 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని రోహిణి కోర్టులో జరిగింది.
దిల్లీలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న జితేందర్ గోగి తిహార్ జైల్లో శిక్ష అనుభవించేవాడు. ఓ కేసు విచారణలో భాగంగా శుక్రవారం జితేందర్ గోగిని రోహిణిలోని కోర్టుకు తరలించారు. అదే సమయంలో లాయర్ల వేషధారణలో వచ్చిన ముగ్గురు ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యులు కోర్టు ఆవరణలోనే గ్యాంగ్ స్టర్ జితేందర్ గోగిపై కాల్పులు జరిపారు. ముగ్గురు దుండగులు దాదాపు 35 నుంచి 40 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో జితేందర్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.
అయితే వెంటనే దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు , దుండగులపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు దుండగులు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు పాల్పడిన దుండగులంతా టిల్లు తాజ్ పూరియా గ్యాంగ్ సభ్యులుగా అనుమానిస్తున్నట్లు రోహిణి డీసీపీ ప్రణవ్ తయాల్ తెలిపారు. గ్యాంగ్ స్టర్ జితేందర్ గోగిపై చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే ఈ మధ్య ఓ వ్యాపారవేత్తను రూ.5కోట్లు ఇవ్వాలని జితేందర్ గోగి బ్లాక్ మెయిల్ చేయడంతో ఆయనపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో భాగంగా జితేందర్‌ను దిల్లీ స్పెషల్‌సెల్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసి తిహార్ జైల్లో పెట్టారు. విచారణలో భాగంగా జితేందర్ గోగిని రోహిణి కోర్టుకు తీసుకురాగా ఈ దాడి జరిగింది.
సినీ ఫక్కీలో షూటౌట్ జరిగినట్లు ఉన్నా.. అది గ్యాంగ్ వార్ కాదని ఢిల్లీ పోలీసు కమిషనర్ తెలిపారు. జితేందర్‌ను చంపేందుకు వచ్చిన వ్యక్తుల్లో ఒకరి తలపై నజరానా ఉన్నది. అతన్ని పట్టిస్తే 50 వేల రివార్డు ఉన్నట్లు రాకేశ్ ఆస్తానా తెలిపారు. మారువేషాల్లో వచ్చిన వారిని టిల్లు గ్యాంగ్ వ్యక్తులుగా గుర్తించారు.