Begin typing your search above and press return to search.
కరోనా పంజా: విజయవాడలో ఒకే కుటుంబంలో నలుగురి మృతి
By: Tupaki Desk | 1 Nov 2020 5:00 PM GMTప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలవుతోందన్న హెచ్చరికల నడుమ ఏపీలోని విజయవాడలో దారుణం జరిగింది. కరోనాతో విజయవాడకు చెందిన ఓ న్యాయవాది కుటుంబంలో నలుగురు మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
ఇప్పటికే యూరప్ దేశాల్లో కరోనా రెండో వేవ్ మొదలై వేల కేసులు నమోదై మరణాల తీవ్రత పెరిగింది. దేశంలోనూ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని ఈ ఘటన రుజువు చేసింది.
విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది తల్లి అక్టోబర్ 8న మరణించింది. గత నెల 30న న్యాయవాది భార్య మరణించింది. భార్య అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే న్యాయవాది కూడా మరణించారు.ఈ ముగ్గురూ కూడా కరోనాతోనే చనిపోవడం విషాదం నింపింది.
మరోవైపు కరోనాతో బాధపడుతున్న న్యాయవాది కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించడం తీవ్ర విషాదం నింపింది. ఇలా కరోనా వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడంతో బంధుమిత్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఇటీవల మళ్లీ చలికాలం మొదలు కావడంతో తీవ్రత పెరిగింది. గతంలో రోజుకు పదివేల కేసులు నమోదయ్యాయి. మధ్యలో తగ్గాయి. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి.