Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో హత్యల కలకలం: రెండు రోజుల్లో ఐదుగురి దుర్మరణం
By: Tupaki Desk | 7 Jun 2020 10:19 AM GMTమళ్లీ హైదరాబాద్ నగరంలో నేరాలు పెరుగుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా ఐదుగురు హత్యల్లో మరణించడం కలకలం రేపుతోంది. జూన్ 5వ తేదీ శుక్రవారం ఒకేరోజు నాలుగు హత్యలతో హైదరాబాద్‌లో సంచలనం రేపగా.. అది మరువకముందే శనివారం మరో హత్య చోటుచేసుకుంది. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే వైరస్‌తో హైదరాబాద్ లో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడగా ఇప్పుడు హత్యలతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనగా జీవిస్తున్నారు.
గండిపేట్ మండలంలోని హైదర్షాకోటలో నివసిస్తున్న సత్యనారాయణ(50) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో పని చేస్తుండేవాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన హిమాయత్‌సాగర్ గ్రామం పరిధిలోని నిర్మానుష్య ప్రాంతంలో శవంగా కనిపించాడు. అతడిని పరిశీలించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అతడు హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
అతడిని గుర్తుతెలియని వ్యక్తులు తలపై బండరాయితో మోది చంపేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. అయితే ఆయన్ను ఎందుకు? ఎవరు హత్య చేశారనే కోణంలో విచారణ చేపడుతున్నారు. ఈ సందర్భంగా బాధితుడి కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నారు. విచారణలో భాగంగా అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఫుటేజీల ద్వారా నిందితుల ఆచూకీ తెలిసే అవకాశం ఉంది.