Begin typing your search above and press return to search.

ఈ దారుణ వీడియోను పోస్టు చేయట్లేదు..కానీ విషయం తెలుసుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   25 Nov 2021 9:36 AM GMT
ఈ దారుణ వీడియోను పోస్టు చేయట్లేదు..కానీ విషయం తెలుసుకోవాల్సిందే
X
ఒప్పుకునే వీలు లేకపోవటంతో మీకు చూపించలేకపోతున్నాం. ఈ వీడియోను చూసిన తర్వాత.. ఏపీలో రాజకీయం ఎంతలా దిగజారిందన్న విషయాన్ని అందరికి తెలియజేయాలన్న ఆలోచన కలిగింది. ఈ కారణంతోనే ఈ వార్తను రాస్తున్నాం. పట్టపగలు.. నడి రోడ్డు మీద ఒక నడివయస్కుడైన వ్యక్తిని పట్టుకొని నలుగురువ్యక్తులు కర్రతోనూ.. పెద్ద రాళ్లతో ఉన్మాదంగా దాడి చేస్తున్న వైనం చూస్తే నోటి వెంట మాట రాలేదు.

ఇలాంటి సీన్ సినిమాలో అయితే..అతగాడ్ని రక్షించటానికి హీరో వస్తాడు. కానీ.. ఇది రియల్ జీవితం. ఇందులో అందరూ హీరోలే. కానీ.. ఏ ఒక్కరు కూడా బాధితుడికి అండగా నిలవటానికి సాహసించే ప్రయత్నం చేయలేదు.

ఇంతకూ అసలేం జరిగింది? ఈ దాడి ఎక్కడ జరిగింది? దాడికి కారణం ఏమిటి?అన్న వివరాల్లోకి వెళితే.. షాకింగ్ నిజాలు బయటకు వస్తాయి.గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. నాలుగు రోజుల క్రితం ఈ దారుణం చోటు చేసుకుంది.

మొన్న జరిగిన పంచాయితీఎన్నికల్లో టీడీపీ తరఫున పని చేశాడు 43 ఏళ్ల టీడీపీ కార్యకర్త షేక్ సైదా. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువుకు చెందిన ఇతను.. ఈ నెల 21న పిడుగురాళ్ల పట్టణంలో జరిగిన ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వచ్చాడు. ఫంక్షన్ ముగిసిన తర్వాత టూ వీలర్ మీద ఊరికి బయలుదేరాడు. పిడుగురాళ్ల పట్టణ శివారులో అద్దంకి -నార్కట్ పల్లి రోడ్డులో సైదా గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త శివారెడ్డి.. మరో నలుగురు కారులో వచ్చి అతడ్ని అడ్డుకున్నారు.

టూ వీలర్ మీద నుంచి కింద పడిన అతడ్ని పట్టుకొని రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ మీద పడేసి.. రాడ్లు..కర్రలతోపాటు రాళ్లతో కొట్టారు. ఇది గమనించిన వాహనదారులు వీడియో తీశారు. పెద్ద ఎత్తున అరుపులు వేయటంతో.. దాడి చేస్తున్న వారు పరారయ్యారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే తనను దారుణంగా దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయటానికి వెళితే.. పొలం గట్టు గొడవగా కేసు నమోదు చేసినట్లుగా సైదా వాపోతున్నాడు.

దీంతో.. ఏం చెప్పాలో పాలుపోక వేదన చెందుతున్నపరిస్థితి. దాడి వీడియో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావటం.. పెద్ద ఎత్తున విమర్శలు చోటు చేసుకోవటంతో ఎట్టకేలకు రంగంలోకి దిగిన పోలీసులు.. శివారెడ్డిని అరెస్టు చేశారు. రాజకీయాలు తప్పేం కావు. కానీ.. ఒక పార్టీ మీద ఉన్న అభిమానాన్ని అతిగా ఊహించుకొని ఈ తరహాలో దాడి చేయటం క్షమార్హం కాదు.

ఇలాంటి కల్చర్ ను వైసీపీ నేతలు వీలైనంత త్వరగా అడ్డుకోకుంటే.. ఏపీలో మరో తరహా రాజకీయానికి తెర తీసిన చెడ్డపేరు మూటకట్టుకోవడం ఖాయమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.