Begin typing your search above and press return to search.

చీకోటి ప్రవీణ్ కేసులో సంచలనం: ఆ నలుగురు ప్రముఖులకు ఈడీ నోటీసులు

By:  Tupaki Desk   |   6 Aug 2022 3:42 AM GMT
చీకోటి ప్రవీణ్ కేసులో సంచలనం: ఆ నలుగురు ప్రముఖులకు ఈడీ నోటీసులు
X
సరదాకు ఆడిన క్యాసినో, పేకాట తదితర వ్యసనాలు ఇప్పుడు ఆ ప్రముఖుల మెడకు చుట్టుకుంటున్నాయి. చీకోటి ప్రవీణ్ తో కలిసి జల్సా చేసిన ప్రముఖులకు నోటీసులు అందుతుండడం వారిని కలవరపెడుతోంది. విదేశీ క్యాసినో, హవాలా వ్యవహారంలో ఈడీ లోతుగా విచారణ చేస్తున్న వేళ ఈ కేసు తాజాగా మలుపు తిరిగింది.

చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో పలువురు రాజకీయ నేతలతో జరిపిన వాట్సాప్ చాటింగ్ కలకలం రేపుతోంది. నేపాల్, శ్రీలంక , థ్యాయ్ లాండ్, మలేషియా తదితర దేశాల్లో క్యాసినోల నిర్వహణలో ఆరితేరిన చీకోటి ప్రవీణ్, పలువురు ఎమ్మెల్యేల వాట్సాప్ సంభాషణలను ఈడీ గుర్తించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రవీణ్, మాధవరెడ్డి సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ లో శాస్త్రీయంగా విశ్లేషించడం ద్వారా తొలగించిన సంభాషణలేమైనా ఉంటే రికవరీ చేసేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది.

చీకోటి ప్రవీణ్ కేసులో ప్రవీణ్ తోపాటు మరో ఏజెంట్ దాసరి మాధవరెడ్డి ఇంట్లో సోదాలు చేసిన ఈడీ బృందాలు పలు సాంకేతిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాయి. సెల్ ఫోన్లతోపాటు ల్యాప్ ట్యాప్ లను జప్తు చేసి వాటిని విశ్లేషించడంలో నిమగ్నమయ్యాయి. సంభాషణల్లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల వాట్సాప్ చాటింగ్ లు ఉంటాయని ముందు నుంచే ప్రచారం జరిగింది.

ఈ క్రమంలోనే ప్రవీణ్ ఫోన్ లో తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేతో సాగించిన వాట్సాప్ సంభాషణలను ఈడీ గుర్తించినట్టు తెలిసింది. వీటిపై లోతుగా విశ్లేషిస్తున్నారు. వీరితో ప్రవీణ్ ఆర్థికలావాదేవీలు.. మనీలాండరింగ్ పై తేల్చేపనిలో ఈడీ నిమగ్నమైంది.

ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు, వాట్సాప్ చాటింగ్ ను రీట్రైవ్ చేసే పనిలో ఉన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ లో శాస్త్రీయంగా విశ్లేషించడం ద్వారా తొలగించిన సంభాషణలేమైనా ఉంటే రికవరీ చేసేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది.

ఇక ఈ కేసులో తాజాగా చీకోటి ప్రవీణ్ స్టేట్ మెంట్ ఆధారంగా నలుగురు ప్రజాప్రతినిధులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఒక ఏపీ మాజీ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపటి నుంచి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

తెలుగురాష్ట్రాల్లో సంచలనమైన ‘క్యాసినో’ కేసులో ఇతడే ప్రధాన ముద్దాయి. చీకోటి ప్రవీణ్ తోపాటు మరో ముగ్గురు లావాదేవీలు, బ్యాంకు అకౌంట్లను పరిశీలించిన ఈడీ మొత్తంగా రూ.25 కోట్ల లావాదేవీలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ నగదు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఎలా మార్పిడి చేశారు? వంటి అంశాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.. తాజాగా నలుగురికి నోటీసులు జారీ చేసింది.

కేసినోలకు అలవాటు పడిన ప్రముఖులు, రాజకీయ నేతలు, సంపన్నులు చీకోటి ప్రవీణ్ ద్వారా గోవా, నేపాల్, బ్యాంక్ కేసినోలకు వెళ్లేవారు. వారు ఇక్కడ నగదు రూపంలో లక్షలు చీకోటి ప్రవీణ్ అతడి ఏజెంట్లకు చెల్లిస్తే .. వారు ఏ దేశానికి వెళతారో? ఆ దేశం కరెన్సీని కమిషన్ మినహాయించుకొని సమకూరుస్తారు.ఇలా కరెన్సీ కంటే ఎక్కువగా వారు కేసినోలో ఆడే కాయిన్స్ ఇస్తారని చెబుతున్నారు. తర్వాత అక్కడ ఓడిపోతే ఇక్కడ తీసుకునే సమస్య ఉండదు.ఇక కేసినోల్లో విదేశాల్లో గెలుచుకుంటే వాటిని వైట్ మనీగా ఇండియాకు చేర్చే బాధ్యత కూడా చీకోటి ప్రవీణ్ తీసుకుంటారని చెబుతున్నారు. దానికీ కమిషన్ పొందుతాడని అంటున్నారు. ఈ కేసును ఛేదించిన ఈడీ ప్రస్తుతం విచారణ జరుపుతోంది.