Begin typing your search above and press return to search.
హుజూరాబాద్ బరిలో నలుగురు రాజేందర్ లు
By: Tupaki Desk | 11 Oct 2021 11:07 AM GMTహుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడానికి.. ప్రత్యర్థులను ఓడించడానికి సామధానబేధ దండోపాయాలను పార్టీలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ ను ఎదురించి బీజేపీలో చేరి పోటీచేస్తున్న ఈటల రాజేందర్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్లో గెలుపుకోసం అటు టీఆర్ఎస్ .. ఇటు బీజేపీ పట్టుదలతో ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. అక్టోబర్ 30న ఎన్నికలు జరుగనున్నాయి. అధికార పార్టీ నామినేషన్ సందర్భంగానే ఈటలను దెబ్బకొట్టినట్టుగా తెలుస్తోంది.
ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో సుదీర్ఘకాలంగా రాజకీయాలు చేస్తున్నారు. అక్కడ ఆయన వరుసగా టీఆర్ఎస్ టికెట్ పై గెలిచారు. ఇప్పుడు బీజేపీ గుర్తుపై పోటీచేస్తున్నారు. ఈటలను గురిచూసిన టీఆర్ఎస్ ఎప్పటి నుంచి ఇక్కడ స్కెచ్ గీస్తోంది. ఆల్ రెడీ మంత్రి హరీష్ రావు సహా టీఆర్ఎస్ శ్రేణులు అదే పనిలో ఉన్నాయి.
హుజూరాబాద్ లో ఈటలను ఓడించేందుకు టీఆర్ఎస్ ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్ ను దెబ్బకొట్టేందుకు అదే పేరుతో మరో ముగ్గురితో టీఆర్ఎస్ నామినేషన్లు వేయించినట్టుగా బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఒఖే పేరుతో నలుగురు అభ్యర్థులుంటే ఓటర్లు గందరగోళానికి గురి అవుతారనేది ప్రత్యర్థుల ఎత్తుగడగా కనిపిస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. అదే పేరున్న మరో ముగ్గురిని ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి మరీ నామినేషన్ వేయించడం చర్చనీయాంశమైంది.
హుజూరాబాద్ లో ఇప్పలపల్లి రాజేందర్, ఈసంపల్లి రాజేందర్, ఇమ్మడి రాజేందర్ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలనలో ఇవి ఉంటాయా? ఉండవా? అన్నది తేలాల్సి ఉంది. అయితే బీజేపీ గుర్తు ఈటలకు సరిపోతుందని.. పేరు చూసి ఎవరూ ఓటు వేయరని కొందరు అంటున్నారు. మరి ప్రత్యర్థుల కుట్ర ఫలిస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.