Begin typing your search above and press return to search.

ర్యాగింగ్ : విద్యార్థిని సూసైడ్ .. నలుగరు విద్యార్థినిలకి ఐదేళ్ల జైలు శిక్ష !

By:  Tupaki Desk   |   6 Feb 2021 11:58 AM GMT
ర్యాగింగ్ : విద్యార్థిని సూసైడ్ .. నలుగరు విద్యార్థినిలకి ఐదేళ్ల జైలు శిక్ష !
X
ర్యాగింగ్ .. ఓ పెను భూతం. చదుకోవడానికి వెళ్లిన ఎంతోమంది స్టూడెంట్స్ , ఈ ర్యాగింగ్ అనే భూతానికి బలైపోయారు. ర్యాగింగ్ అనేది సీనియర్ , జూనియర్ల మధ్య బాండింగ్ ఏర్పడేలా ఉండాలి కానీ , ప్రాణాలు తీసుకునేలా ఉండకూడదు. కానీ, పలు కాలేజీల్లో సీనియర్ల ర్యాగింగ్ కి తట్టుకోలేక ఎంతోమంది విద్యార్థులు సూసైడ్ కి పాల్పడుతున్నారు. ఈ తరహా కేసులో తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ జిల్లా కోర్టు శనివారం సంచలన తీర్పును ఇచ్చింది. ర్యాగింగ్ కేసులో నలుగురు యువతులకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 8 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కేసులో ఓ విద్యార్థినిని సదరు యువతులు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు రుజువు కావడంతో జిల్లా న్యాయస్థానం ఈ తీర్పిచ్చింది.

వివరాల్లోకి వెళ్తే .. ఓ ప్రైవేటు కళాశాలలో అనిత అనే విద్యార్థి బీఫార్మసీ స్టూడెంగ్‌ గా చేరింది. అయితే అదే కళాశాలకు చెందిన నలుగురు సీనియర్లు విద్యార్థినిలు తమ కళాశాలలోకి జూనియర్‌గా వచ్చిన అనితపై ర్యాంగింగ్‌ కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా వారు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాధిత యువతి సుసైడ్‌ లేఖ రాసి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ లేఖలో నలుగురు యువతుల పేర్లు రాసి, తన చావుకు వాళ్లే కారణమని రాసింది. బాధిత యువతి లేఖలో ఈ విధంగా పేర్కొంది ‘నేను కాలేజీకి వచ్చినప్పటి నుంచి ఈ నలుగురు అమ్మాయిలు నన్ను ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు. ర్యాగింగ్‌ను నేను ఇప్పటి వరకు ఎలా అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. కాలేజీలో సీనియర్లకు ఫిర్యాదు చేస్తే, సీనియర్లు కూడా అది సహజం అని నాకు చెప్పారు. కాలేజీ యాజమాన్యం కూడా స్పందించలేదు. చనిపోయాక సోదరుడు, తల్లిదండ్రులు నన్ను మిస్‌ కావొద్దు, అని ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తర్వాత ఆ నలుగురు యువతులపై ఐపీసీ 306 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా దీనిపై తుది తీర్పును వెలువరించిన న్యాయస్థానం ర్యాగింగ్‌కు పాల్పడిన నలుగురు విద్యార్థినులకు జైలుశిక్షను ఖరారు చేసింది.