Begin typing your search above and press return to search.
టీడీపీలో ఉండేది నలుగురు ఎమ్మెల్యేలేనా ?
By: Tupaki Desk | 16 Dec 2019 11:03 AM GMTఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కానీ , తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఫ్యాన్ జోరుకి పోటీ చేసిన 175 స్థానాల నుండి కేవలం 23 చోట్ల మాత్రమే విజయం దక్కించుకుంది. కానీ , ఆ తరువాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీని విడిపోవడం తో ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలో 22 మంది ఎమ్మెల్యే లు మాత్రమే ఉన్నారు. కానీ , ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలని చూస్తే మాత్రం .. ప్రతిపక్ష టీడీపీ లో ఉండేది నలుగురు ఎమ్మెల్యేలేనా అని అనిపిస్తుంది.
అదేంటి టీడీపీలో ఉండేది 22 మంది ఎమ్మెల్యే లు కదా అంటే ..పార్టీ తరపున గెలిచిన వారు 22 మంది ఉన్నప్పటికీ ..అసెంబ్లీ లో పార్టీ తరపున తమ వాణిని వినిపించేది మాత్రం చంద్రబాబు తో సహా నలుగురు మాత్రమే.మిగిలిన వారు వైసీపీ పై ఏ విమర్శ చేస్తే ఏ ఇబ్బంది వస్తుందో అని సైలెంట్ గా ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ అసెంబ్లీ లో చాలా బలహీనంగా ఉన్న టీడీపీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి మరింత బలహీనం చేయాలనే ఎత్తుగడలో వైసిపి వ్యూహాలు రచిస్తోంది. ఇక టీడీపీ - వైసీపీ వ్యూహాలను ఎదుర్కొనేందుకు నానా తంటాలు పడుతోంది.
టీడీపీ ఎమ్మెల్యేలు అంతా అసెంబ్లీ వేదికగా తమ గళాన్ని వినిపించాలి . ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలి . కానీ ఏపీ అసెంబ్లీ లో వైసిపి మాటల దాడిని కానీ - ప్రజా సమస్యలపైన ప్రస్తావన కానీ చేస్తుంది ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే . అచ్చెన్నాయుడు - నిమ్మల రామానాయుడు - గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రమే టీడీపీ నుండి మాట్లాడుతున్నారు. గత అసెంబ్లీ సమావేశాలలోనూ వారే తమ గొంతును ప్రధానంగా వినిపించారు. మిగతా వారంతా సైలెంట్ గా ఉన్నారు.
ఇక పయ్యావుల కేశవ్ - కరణం బలరాం వంటి సీనియర్ నాయకులు టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కానీ వారి వాణి సభలో వినిపించటం లేదు. వెలగపూడి రామకృష్ణ - నందమూరి బాలకృష్ణ వంటి నేతలు ఉన్నా ఎవరూ మాట్లాడని పరిస్థితి. శాసనసభ సమావేశాల్లో వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే చాలా మంది ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. శాసనసభలో వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది పెడతారో అని భయాందోళనకు గురవుతున్నారు. ఇక తాజాగా ప్రకాశం జిల్లాలోని కొందరు టిడిపి ఎమ్మెల్యేలు - విశాఖ నుండి ఒక ఎమ్మెల్యే - అనంతపురం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.ఇక ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు బాసటగా ఎమ్మెల్యేల నుండి పెద్దగా స్పందన రాకపోవడంతో చంద్రబాబు కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.