Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఫోన్ ఎత్తని నలుగురు ఎంపీలు వీళ్లేనా!

By:  Tupaki Desk   |   19 Feb 2019 8:08 AM GMT
చంద్రబాబు ఫోన్ ఎత్తని నలుగురు ఎంపీలు వీళ్లేనా!
X
ఇద్దరు ఎంపీలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీలు అవంతి శ్రీనివాస్ - పండుల రవీంద్రబాబులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ ద్వారా దక్కిన ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేసి వైసీపీలోకి చేరారు.

తెలుగుదేశం పార్టీలో తాము ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వారు వివరించారు. జగన్ ను ప్రశంసిస్తూ వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల నేపథ్యంలోనే అయినా.. వారు తెలుగుదేశం అధినేతను ఘాటుగా విమర్శిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వైనం ఆసక్తిదాయకంగా మారింది.

అయితే ఇంతటితో వలసలు ఆగవని. మరి కొన్ని ఉండబోతున్నాయనే మాట వినిపిస్తోంది. పలువురు ఎంపీలు తెలుగుదేశాన్ని వీడటం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరి వారు ఎవరెవరో కానీ.. కొందరు ఎంపీలు ఇప్పటికే బాబుతో టచ్లో లేరని సమాచారం. వారితో మాట్లాడటానికి బాబు ప్రయత్నిస్తున్నా సదరు నేతలు ఫోన్ లో టచ్లోకి రావడం లేదని సమాచారం.ఆ జాబితాలో నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

నిమ్మల కిష్టప్ప - బుట్టార రేణుక - తోట నరసింహం - అశోక్ గజపతి రాజు..ఈ నలుగురు ఎంపీలూ ఇప్పుడు చంద్రబాబుకు టచ్ లోకి రావడం లేదట.పార్టీలోని వివిధ పరిణామాల పట్ల వారు అసహనంతో ఉన్నారని సమాచారం. వీరిలో అశోక్ గజపతి రాజు తప్ప మిగిలిన ముగ్గురూ పార్టీకి రాజీనామా చేసినా పెద్దగా ఆశ్చర్యం లేదని సమాచారం.

పార్టీలో పరిణామాల పట్ల అశోక్ గజపతి రాజు ప్రస్తుతం అసహనంతో ఉన్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేయాలని అనుకోవడం లేదట. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని లేదా తన కూతురుకు అయినా ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని అంటున్నారట.