Begin typing your search above and press return to search.
37 రోజుల్లో నాలుగు పెళ్లిళ్లు.. 3సార్లు విడాకులు.. అదెలా?
By: Tupaki Desk | 15 April 2021 12:30 PM GMTమీరు చదివింది అక్షరాల నిజం. కేవలం 37 రోజుల్లో నాలుగుసార్లు పెళ్లిళ్లు చేసుకొని.. మూడుసార్లు విడాకులు తీసుకోవటమే కాదు.. ఐదోసారి పెళ్లి చేసుకోవటానికి ప్రయత్నిస్తున్న వేళ.. విషయం కోర్టు వరకు వెళ్లింది. ఈ సిత్రమైన ఉదంతం చోటు చేసుకుంది మన దేశంలో కాదు.. తైవాన్ లో. ఇంతకూ జరిగిందేమిటి? అంత స్వల్ప వ్యవధిలో అన్ని పెళ్లిళ్లు.. విడాకులు ఎలా తీసుకున్నాడు? అతగాడు చేసిన పనికి కోర్టు కూడా ఎందుకు తప్పు పట్టలేదు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.
ఈ ఉదంతం గురించి తెలుసుకోవటానికి ముందు తైవాన్ లోని చట్టం గురించి తెలిస్తే.. ఈ ఇష్యూ మొత్తం ఇట్టే అర్థమైపోతుంది. తైవాన్ చట్టం ప్రకారం ఉద్యోగి పెళ్లి చేసుకుంటే అతనికి ఎనిమిది రోజులు పెయిడ్ వర్కు లీవ్ మంజూరు చేయాలి. ఇక.. విషయంలోకి వెళితే బ్యాంకులో క్లర్కుగా పని చేసే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం అతడికి ఎనిమిది రోజులు సెలవులు వచ్చాయి. పెళ్లైన ఎనిమిదో రోజున విడాకులు ఇచ్చేశాడు. తర్వాతి రోజు ఆమెనే మళ్లీ పెళ్లి చేసుకొని మరో ఎనిమిది రోజులు సెలవు పెట్టాడు.
ఇలా 37 రోజుల్లో ఆమెకు మూడుసార్లు విడాకులు ఇచ్చి.. నాలుగుసార్లు పెళ్లి చేసుకున్నాడు. మొత్తం32 సెలవుల్ని ఎంజాయ్ చేశాడు. తాజాగా నాలుగోసారి విడాకులు ఇచ్చేసి.. ఐదోసారి పెళ్లి చేసుకోవటానికి రంగం సిద్దం చేసుకున్నాడు. విడాకులకు ముందే లీవ్ లెటర్ సిద్ధం చేసుకొని తాను పని చేసే బ్యాంకుకు తన రిక్వెస్టును పంపాడు. ఈసారి బ్యాంకు అధికారులు మాత్రం అతడికి సెలవు ఇవ్వలేదు. సెలవుల కోసమే ఇలా పెళ్లి.. విడాకులు చేసుకుంటున్నాడని పేర్కొంటూ.. తైపీ సిటీ లేబర్ కోర్టుకు కంప్లైంట్ చేశారు.
కోర్టు విచారణలో భాగంగా బ్యాంకు ఆర్టికల్ 2లో భాగంగా లేబర్ లీవ్స్ ను తాను వాడుకుంటున్నానని వాదించాడు. అతడు చెప్పిన రూల్ ప్రకారం..పెళ్లి చేసుకుంటే 8రోజులు లీవ్ ఇవ్వాలి. అందులో ఉన్న లొసుగు ఆధారంగా చేసుకొని ఉద్యోగానికి సెలవు తీసుకుంటున్నట్లుగా బ్యాంకు వాదించింది. అయితే..నిబంధనల ప్రకారమే తాను వ్యవహరిస్తున్నట్లుగా బ్యాంకు ఉద్యోగి వాదించాడు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. ఉద్యోగి చేసిందే సరైనదంటూ తీర్పుఇస్తూ.. బ్యాంకుకు ఫైన్ విధించింది. రూల్ ప్రకారం సదరు ఉద్యోగి ఏ మాత్రం తప్పు చేయటం లేదని పేర్కొన్నకోర్టు.. అతడిపై కంప్లైంట్ ఇచ్చిన బ్యాంకుకు మన రూపాయిల్లో రూ.52వేలు ఫైన్ విధించింది. ఈ ఉదంతం అక్కడి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చట్టంలోని లొసుగును పట్టుకొని ఇతర ఉద్యోగులు పెళ్లిళ్లు చేసుకుంటూ పోతే ఎలా అన్న ప్రశ్న వినిపిస్తోంది. నిజమే కదా?