Begin typing your search above and press return to search.
జగన్ మార్క్ పెద్ద మనుషులు రెడీ ... ?
By: Tupaki Desk | 6 Nov 2021 7:31 AM GMTపెద్దల సభ ఒకనాడు వైసీపీ సర్కార్ ని హడలెత్తించింది. ఏ బిల్లు పెట్టినా అక్కడ చిల్లు పెట్టడానికి బలమైన టీడీపీ రెడీగా ఉండేది. దాంతో ఒక దశలో ఆగ్రహించిన జగన్ ఏకంగా శాసమండలికే తలాక్ అనేశారు. అసెంబ్లీలో మండలి రద్దుకు తీర్మానం ఆమోదించి మరీ కేంద్రానికి పంపించారు. అయితే అక్కడ అది పెండింగులో ఉంది. ఈలోగా సమీకరణలు మొత్తం మారిపోయాయి. మండలిలో వరసగా అవుతున్న ఖాళీలతో టీడీపీ బక్కచిక్కిపోగా వైసీపీ బలపడుతోంది. తాజాగా పద్నాలుగు ఎమ్మెల్సీ ఖాళీలు ఏర్పడ్డాయి. ఇందులో స్థానిక సంస్థల కోటాలో పదకొండు ఉంటే ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీల కోటాలో మూడు స్థానాలు ఉన్నాయి. మొత్తానికి మొత్తం పద్నాలుగు సీట్లు వైసీపీకే దక్కనున్నాయి.
దాంతో వైసీపీలో ఆశావహుల హడావుడి మొదలైంది. ముందుగా ఎమ్మెల్యే కోటాలో మూడు సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో ఆ ముగ్గురు అదృష్టవంతులూ ఎవరూ అన్న చర్చ వస్తోంది. అయితే అధినాయకుడు జగన్ ఇప్పటికే వారెవరో సెలెక్ట్ చేసి పెట్టేశారు అన్న టాక్ కూడా నడుస్తోంది. మూడు ప్రాంతాలు, ముగ్గురు నాయకులు మూడు సామాజిక వర్గాలు అన్నట్లుగా ఈ ఎంపిక జరిగింది అంటున్నారు. రాయలసీమ నుంచి ఓసీ కోటాలో మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి మరోసారి చాన్స్ తగలనుందిట. మరే విధమైన ఆలోచన లేకపోతే మాత్రం ఇదే కన్ ఫర్మ్ అంటున్నారు.
ఇక ఉత్తరాంధ్రా జిల్లాల విషయానికి వస్తే శ్రీకాకుళానికి చెందిన డీసీసీబీఎ మాజీ చైర్ పర్సన్ పాలవలస విక్రాంత్ కి ఎమ్మెల్సీ పదవి గ్యారంటీ అంటున్నారు. ఆయన కుటుంబానికి మంచి రాజకీయ చరిత్ర ఉంది. తండ్రి పాలవలస రాజశేఖరం శ్రీకాకుళం ఎంపీగా గతంలో పనిచేశారు. ఇక విక్రాంత్ సోదరి రెడ్డి శాంతి పాతపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె వైసీపీలో సీనియర్ నేత. విక్రాంత్ కూడా గతంలో డీసీసీబీ చైర్మన్ చేశారు. ఆయనకు పాలకొండలో పట్టుంది. అయితే అది ఎస్టీ సీటు కావడంతో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కుదరదు. దాంతో పాటు లేటెస్ట్ గా జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో చైర్మన్ పదవి ఆ కుటుంబానికి ఇస్తారని బాగా ప్రచారం జరిగింది. కానీ జగన్ ఇచ్చాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్ఛార్జి సిరియా సాయిరాజ్ సతీమణి విజయకు చాన్స్ ఇచ్చారు. దాంతో విక్రాంత్ కి ఇపుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అంటున్నారు. ఆయన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత.
ఇక మరో సీటుని కోస్తా జిల్లాలకు చెందిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారికి ఇస్తారని చెబుతున్నారు. అదె కనుక జరిగితే మొత్తం మూడు ఎమ్మెల్సీలకు గానూ ఒక ఓసీ, ఒక బీసీ, ఒక ఎస్సీ వర్గాలతో భర్తీ చేసినట్లు అవుతుంది. అదే విధంగా సామాజిక న్యాయం కూడా పాటించినట్లు అవుతుంది అంటున్నారు. ఇక మరో 11 ఎమ్మెల్సీలకు కూడా త్వరలో నోటిఫికేషన్ రానుందిట. దాంతో మిగిలిన వారికి సామాజిక వర్గాల ప్రాతిపదికన అవకాశం కల్పిసారు అంటున్నారు. మొత్తానికి జగన్ మార్క్ సెలెక్షన్ లో రెడీ చేసిన వైసీపీ పెద్ద మనుషులును వరసబెట్టి మరీ శాసనమండలికి పంపుతారు అంటున్నారు.