Begin typing your search above and press return to search.

మరో వికెట్‌.. మోదుగుల కూడా వైసీపీలోకే

By:  Tupaki Desk   |   20 Feb 2019 1:00 PM IST
మరో వికెట్‌.. మోదుగుల కూడా వైసీపీలోకే
X
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగులు వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం లండన్‌ టూర్‌ లో ఉన్నారు జగన్‌. జగన్ లండన్‌ నుంచి వచ్చిన తర్వాత మోదుగుల వైసీపీలోకి అధికారికంగా జాయిన్‌ అవుతారని సమాచారం. అయితే.. అన్నింటికింటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మోదుగుల వైసీపీలోకి వెళ్తున్నారని న్యూస్‌ లో రాజకీయ వర్గాల్లో స్ప్రెడ్‌ చేస్తోంది టీడీపీ అనుకూల మీడియానే

2009 ఎన్నికల్లో నరసారావు పేట ఎంపీగా గెలుపొందారు మోదుగుల. ఆయన నరసారావు పేటపై గట్టి పట్టుంది. ఆ తర్వాత కూడా ఆయన అదే స్థానం నుంచి ఎంపీ కానీ, ఎమ్మెల్యే సీటు కాని అడిగారు. కానీ చంద్రబాబు ఇవ్వలేదు. దీంతో.. అప్పటినుంచి పార్టీలో కాస్త ఇబ్బందిగానే ఉన్నారు. సీనియర్‌ అయినా కానీ మోదుగులని చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదు. దీంతో.. ఇప్పుడు వైసీపీలోకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి ఎమ్మెల్యేగా కానీ లేదా నరసరావుపేట ఎంపీగా పోటీ చేసేందుకు మోదుగుల ఆసక్తి చూపిస్తున్నారట.

అయితే సత్తెనపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్పల్పమెజారిటీతో ఓడిపోయారు అంబటి రాంబాబు. మరి ఈసారి సత్తెనపల్లి టిక్కెట్‌ అంబటి రాంబాబుకు దక్కుతుందా లేదా మోదుగులకే ఇస్తారా అనేది జగన్‌ లండన్‌ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాతే తేలుకుంది.