Begin typing your search above and press return to search.
లేడి జర్నలిస్టుతో పెట్టుకున్న ట్రంప్
By: Tupaki Desk | 29 Jan 2019 9:38 AM GMTగబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తిక్కకు ఓ లెక్కుటుంది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిక్కకు లెక్కేలేదు. మెక్సికో సరిహద్దుల్లో గోడకట్టడమే సదాశయంగా ఆర్థిక బిల్లును కూడా ఆమోదించకుండా నెలరోజులుగా పాలన పడకేయించి.., అధికారులకు జీతాలు నిలిపివేసిన ట్రంప్ ఎట్టకేలకు బెట్టు వీడి ఆర్థిక బిల్లును తాజాగా ఆమోదించారు. కానీ గోడ కట్టడంపై వెనక్కిపోను అంటూ స్పష్టం చేశారు.
ఇక ఈ వ్యవహారంలో తనను టార్గెట్ చేసిన మీడియాపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న సీఎన్ ఎన్ - ఎన్ బీసీ మీడియా సంస్థలపై దుమ్మెత్తిపోసేవారు. ఇప్పుడు తాజాగా తనకు అనుకూలంగా ఉండే న్యూస్ నెట్ వర్క్ పై కూడా ట్రంప్ ఒంటికాలిపై లేవడం అమెరికాలో ఆసక్తికర పరిణామంగా మారింది.
తాజాగా ట్రంప్ ఫాక్స్ న్యూస్ కు చెందిన జర్నలిస్టులు జాన్ రాబార్ట్స్ - గిలియన్ టర్నర్ ల పేర్లు ప్రస్తావిస్తూ.. ‘ఇలా అనాల్సి వస్తుందనుకోలేదు.. కానీ తప్పడం లేదు. వీళ్లిద్దరికీ ఫేక్ న్యూస్ మీద తప్ప.. మెక్సికో-అమెరికా సరిహద్దుల్లో జరగాల్సిన గోడ నిర్మాణంపై కనీస అవగాహన లేదు’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేయడం దుమారం రేపింది. ఈ విషయంపై సీరియస్ అయిన ఫాక్స్ న్యూస్ సీనియర్ జర్నలిస్టు జూలి బాండేరస్ డొనాల్డ్ ట్రంప్ పై ట్విట్టర్ లో యుద్ధం మొదలుపెట్టింది..
జూలి ట్వీట్ చేస్తూ.. ట్రంప్ ది బెదిరింపు ధోరణి. అధ్యక్షుడి స్థాయికి తగినది కాదు.. వాళ్లు సగటు జర్నలిస్టులు. వాళ్ల డ్యూటీ వాళ్ల చేస్తారు. మీ అడుగులకు మడుగులొత్తాల్సిన అవసరం వాళ్లకు లేదు’ అంటూ తన తోటి జర్నలిస్టుల మద్దతుగా ట్రంప్ పై ట్వీటాస్త్రం సంధించింది. పాత్రికేయ స్వేచ్ఛను భంగపరిస్తే చూస్తూ ఊరుకోబోమని జూలి హెచ్చరించింది. ఇప్పుడు జర్నలిస్టు-ప్రెసిడెంట్ ట్వీట్ వార్ అమెరికాలో పెద్ద వివాదంగా మారింది. రచ్చ రచ్చ అవుతోంది.