Begin typing your search above and press return to search.
ట్రంప్ బాగా నమ్మే మీడియా సంస్థ సర్వే ఏం చెప్పింది?
By: Tupaki Desk | 3 Nov 2020 12:10 PM GMTమీడియా సంస్థలకు రాజకీయ రంగుల్ని పులమటం కొత్తేం కాదు. అమెరికా అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మీడియా సంస్థలకు.. అధికార పక్షాలకు మధ్య ప్రేమాభిమానాలే కాదు.. పగ.. ప్రతీకారాలు ఎక్కువ. ఈ విషయంపై అధికారపక్షానికి చెందిన అధినేతలు కొన్ని మీడియా సంస్థలపై తరచూ విరుచుకుపడుతుంటారు. పదేళ్ల క్రితం ఈ తీరు చాలా అరుదుగా ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నంగా తరచూ చోటు చేసుకుంటున్నాయి. మరి కాసేపట్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకఘట్టమైన పోలింగ్ జరగనుంది.
మొత్తం 24 కోట్ల మంది రిజిస్టర్ ఓటర్లలో ఇప్పటికే సుమారు 10 కోట్ల మంది తమ ఓటు హక్కును ఈ మొయిల్.. పోస్టల్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాదిరే అమెరికాలోనూ.. అధికారపార్టీకి అనుకూలంగా కొన్ని మీడియా సంస్థలు.. వ్యతిరేకంగా ఉన్నాయన్నది తెలిసిందే. స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విషయానికి వస్తే.. తన విధానాల్ని తరచూ విమర్శలు చేసే మీడియా సంస్థలపై ఆయన తీవ్రంగా విరుచుకుపడుతుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన సీఎన్ఎన్.. న్యూయార్క్ టైమ్స్ పై ట్రంప్ తరచూ పెదవి విరవటమే కాదు.. ఫేక్ న్యూస్ పబ్లికేషన్స్ గా చెబుతుంటారు. అదే సమయంలో.. ఫాక్స్ న్యూస్ పై ఆయన తన అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. సదరు మీడియా సంస్థ వారిని పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇస్తుంటారు.
తాజాగా జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో మిగిలిన మీడియా సంస్థల్ని పక్కన పెట్టి.. ట్రంప్ అభిమానించే ఫాక్స్ న్యూస్ ఏం చెప్పిందన్నది చూస్తే.. బైడెన్ కంటే ట్రంప్ 8 పాయింట్లు వెనుకపడినట్లుగా తేలింది. ఈ సందర్భంగా పలువురు గత ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తున్నారు. అప్పట్లో ట్రంప్ మీద పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ పోల్ సర్వేలలో ముందంజలో ఉండటం.. చివరకు ఓటమిపాలు కావటాన్ని ప్రస్తావిస్తున్నారు.
అయితే.. గత ఎన్నికల్లో హిల్లరీ 10 పాయింట్లు అధిక్యంలో ఉంటే.. పోలింగ్ కు రోజు ముందు ఆమె అధిక్యత నాలుగు పాయింట్లకు పడిపోయింది. దీనికి తోడు స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ విజయం సాధించటంతో.. తొలుత వినిపించిన అంచనాలకు భిన్నమైన ఫలితం వచ్చింది. తాజా పరిస్థితుల్ని చూస్తే.. పోలింగ్ రోజునాటికి కూడా ఇద్దరి మధ్య అధిక్యత విషయంలో ట్రంప్ వెనుకబడటం చూస్తే.. బైడెన్ కు సానుకూల వాతావరణం ఉందన్న మాట వినిపిస్తోంది. అమెరికన్లు ఏమని తీర్పు ఇస్తారో చూడాలి.