Begin typing your search above and press return to search.
చంద్రబాబు ను కాపీ కొట్టిన ఫ్రాన్స్
By: Tupaki Desk | 24 Feb 2020 8:32 AM GMT40ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఏదీ చేసినా విడ్డూరమే అంటారు. గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన ‘దోమలపై దండయాత్ర’ ఎంత సంచలనం సృష్టించిందో చూశాం.. చేతికి చిక్కని దోమలను చంపేందుకు బాబుగారు కోట్లు ఖర్చు పెట్టిన వైనాన్ని చూసి అందరూ ముక్కన వేలేసుకున్నారు.
ఏపీలో చంద్రబాబు దోమలపై దండయాత్ర అని పేరు పెట్టి చేసిన హంగామాను ఆదర్శంగా తీసుకున్న ఓ దేశం అక్కడ నల్లుల పై దండయాత్ర మొదలు పెట్టింది. ఇందుకోసం కోట్లు ఖర్చు పెడుతోంది. బాబు గారు దోమలను పారద్రోలారో లేదో దేవుడికి ఎరుక. కానీ ఫ్రాన్స్ దేశం మాత్రం ఇప్పుడు ఆ దేశంలో పేరుకుపోయిన నల్లుల పై యుద్ధం ప్రకటించాయి.
తాజాగా ఫ్రాన్స్ దేశం యుద్ధం ప్రకటించింది. ఆ దేశంలో నల్లుల బెడద ఎక్కువ కావడంతో వాటి నిర్మూలనకు ఏకంగా 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేసింది. ఓ ప్రత్యేక వెబ్ సైట్ ను లాంచ్ చేసి ఎమర్జెన్సీ నంబర్ ను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఎవరైనా వెబ్ సైట్ లో నంబర్ ను సంప్రదిస్తే చాలు.. ఓ ప్రభుత్వ బృందం ప్రత్యక్షమై నల్లులను చంపేస్తాయి. పేదవారికి పూర్తి ఉచితంగా ఈ సౌకర్యం అందించనుంది.
ఇలా దోమలపై దండయాత్ర పేరిట కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు స్ఫూర్తితో ఫ్రాన్స్ దేశం నల్లులపై పడింది. ఇక్కడ దోమలు చచ్చాయో లేదో కానీ ఫ్రాన్స్ మాత్రం సీరియస్ గానే నల్లులు ఏరివేసే పనిలో పడింది.