Begin typing your search above and press return to search.
దారుణ ఉగ్రదాడిని దగ్గరగా చూసిన దేశాధ్యక్షుడు
By: Tupaki Desk | 14 Nov 2015 4:24 AM GMTఒక దేశ అధ్యక్షుడు స్టేడియంకు వచ్చి.. ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తున్న సమయంలో భద్రత ఏ స్థాయిలో ఉంటుంది? అందులోకి ఉగ్రవాదులు ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉన్న దేశంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు? కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితి ఫ్రాన్స్ లో చోటు చేసుకన్నాయి. మరోవైపు.. ఉగ్రదాడులకు సంబంధించిన ఏదైనా దారుణం చోటు చేసుకుంటే ఆయా ప్రాంతాల్ని అత్యున్నత స్థానంలో ఉన్న వారు పరిశీలించి.. బాధితుల్ని పరామర్శిస్తారు. అయితే.. ఉగ్రదాడిని అత్యంత దగ్గరగా చూడటం చాలా అరుదుగా చోటు చేసుకుంది. కానీ.. అందుకు భిన్నమైన అనుభవం ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు హోలండ్ కు ఎదురైంది. శుక్రవారం రాత్రి ఫ్రాన్స్.. జర్మనీ మధ్య జరుగుతున్న ఫుట్ బాల్ మ్యాచ్ ను ఆయన స్టేడియంలో చూస్తున్న సమయంలోనే.. శక్తివంతమైన పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
దీంతో ఒక్కసారి కలకలం రేగింది. వెనువెంటనే.. అధ్యక్షుడ్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. తాను ఉన్న ప్రాంతానికి అత్యంత సమీపంలో జరిగిన దారుణ ఉగ్రదాడికి ఆ దేశ అధ్యక్షుడే ప్రత్యక్ష సాక్షి కావటం విశేషంగా చెప్పాలి.
మరోవైపు.. పారిస్ లో చోటు చేసుకున్న ఉగ్రదాడుల్లో మరో పాశవికమైన కోణం బయటకు వచ్చింది. వివిధ ప్రాంతాల్లో తాము బందీలుగా తీసుకొచ్చిన వారిని.. ద బటాక్లాన్ అనే ప్రముఖ ప్రాంతానికి తీసుకొచ్చిన ఉగ్రవాదులు.. వారందరిని సామూహికంగా చంపేయటం అందరిని కలిచివేస్తోంది.
ఈ వేదిక వద్ద.. ‘‘ అమెరికన్ బ్యాండ్ ఈగిల్స్ ఆఫ్ డెత్ మెటల్’ పేరిట కచేరీ జరుగుతోంది. ఈ కచేరీకి తాము బంధించిన వారిని తీసుకొచ్చిన ఉగ్రవాదులు.. వారందరినీ ఒకేసారి హతమార్చటం సంచలనం సృష్టిస్తోంది.