Begin typing your search above and press return to search.

యుద్ధమే; ఫ్రాన్స్ ప్రతీకారం మొదలైంది

By:  Tupaki Desk   |   16 Nov 2015 6:05 AM GMT
యుద్ధమే; ఫ్రాన్స్ ప్రతీకారం మొదలైంది
X
ఫ్రాన్స్ దేశ చరిత్రలో కనివినీ ఎరుగని ఘటనగా నవంబరు 13న చోటు చేసుకున్న ఉగ్రఘటనగా చెప్పొచ్చు. ఈ నరమేధంలో 129 మంది మరణించటం తెలిసిందే. ఈ ఉగ్రదాడిపై సీరియస్ గా ఉన్న ఫ్రాన్స్ తన దేశంపై దాడి చేసిన ఉగ్రవాదుల్ని ఏరేసేందుకు ప్రతీకార చర్యలకు దిగింది. ప్యారిస్ లో జరిగిన నరమేధం ఘటన అనంతరం ఆ దేశ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఇది తమ దేశం మీద జరిగిన యుద్ధంగా వ్యాఖ్యానించటం తెలిసిందే. తాజాగా తమపై దాడికి పాల్పడి.. అమాయక ప్రజల్ని చంపిన ఉగ్రవాదుల పని పట్టేందుకు వారి అడ్డాగా ఉన్న సిరియాలోని కొన్ని ప్రాంతాలపై పది యుద్ధ విమానాలతో దాడులకు పాల్పడింది.

భారతకాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున జరిపిన ఈ బాంబుదాడుల్లో శక్తివంతమైన బాంబుల్ని ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. యూఏఈ.. జోర్డాన్ లోని తన బేస్ నుంచి ప్రయోగించిన పది యుద్ధ విమానాలతో సిరియాలోని ఉగ్రవాదులు ఉన్నట్లుగా భావించిన లక్ష్యాల మీద దాడులకు తెగబడింది. ఈ దాడులలో పెద్దఎత్తున ప్రజల ప్రాణాలు పోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. రాత్రివేళ చోటు చేసుకున్న ఈ దాడి కారణంగా రెండు లక్షల మందికి విద్యుత్తు సౌకర్యం అందించే విద్యుత్తు కేంద్రం మీద బాంబులు పడ్డాయని.. దీంతో.. విద్యుత్తు సౌకర్యం నిలిచిపోయిందని చెబుతున్నారు. రాత్రి వేళ కావటంతో నష్టం ఏమిటన్నది తెలీదని.. కాకుంటే.. అమాయక పౌరులు పలువురు మరణించినట్లుగా హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఫ్యారిస్ ఘటన మరింత కలకలానికి కారణమవుతుందని చెప్పక తప్పదు.