Begin typing your search above and press return to search.
హెచ్1బీ రిజిస్ట్రేషన్ల మోసం.. భారతీయులూ... జర జాగ్రత్త
By: Tupaki Desk | 3 Nov 2022 6:30 AM GMTఅమెరికాలో హెచ్1 బీ రిజిస్ట్రేషన్ల మోసం వెలుగుచూసింది. ఈ క్రమంలోనే విదేశీయులు ఈ మోసంలో బలి కాకూడదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చాలా మంది విదేశీయులు అమెరికాలో విద్యను పూర్తి చేసిన తర్వాత ఉద్యోగంలో స్థిరపడేందుకు H1B వీసా కోసం దరఖాస్తు చేసుకుంటారు.
H1B లాటరీలో వీసా పొందడానికి స్ట్రైక్ రేట్‌ను పెంచడానికి కొందరు ఉద్దేశపూర్వక మోసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ దరఖాస్తులు బహుళ రిజిస్ట్రేషన్‌లు చేసుకున్నట్టు తేలింది. డేటా ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో 4,84,000 H1B రిజిస్ట్రేషన్‌లను దాఖలు చేశారు.. అయితే త్వరగా వీసా రావడానికి చాలా మంది ఎక్కువ రిజిస్ట్రేషన్లు చేసుకొని మోసం చేస్తున్నారని తేలింది. ఆ కేసులను మోసం చేశారా? లేక అసలైనవిగా ఎలా గుర్తిస్తారో తెలియాల్సి ఉంది.
చదువు పూర్తి చేసిన విద్యార్థులకు రెండు కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు వచ్చినప్పుడు వారికి H1B కోసం ఆ రెండు కంపెనీలు ఫైల్ చేస్తాయి. రెండూ నిజమైనవిగా పరిగణించబడతాయి. కానీ ఒక సంస్థ నుండి ఒక వ్యక్తికి ఉద్యోగం పొందడానికి మాత్రమే అనుమతి వస్తుంది. మధ్యవర్తులుగా పనిచేసే ఐటీ సంస్థల వల్ల ఒకరి పేరుమీదనే రెండూ, మూడు రిజిస్ట్రేషన్లు కలిగి ఇతర అర్హులకు అన్యాయం జరుగుతోంది. అభ్యర్థులకు వీసా పొందే అవకాశాలను పెంచడానికి కొన్ని కంపెనీలు లంచాలు తీసుకొని ఇలా హెచ్1బీ దరఖాస్తులను చేస్తున్నాయని.. ఇలా చాలా కంపెనీలు నకిలీ H1B వీసాలను దాఖలు చేస్తున్నాయని సమాచారం..
అమెరికాలోని ఒక న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను అనుసరించి ఇప్పుడు సిస్టమ్ మార్చాలని కోరుతున్నారు. ప్రతిదీ క్రమబద్ధీకరించబడితే ఈ నేరానికి శిక్ష అభ్యర్థులను వారి స్వదేశాలకు తిరిగి పంపించడమేనని.. శాశ్వతంగా అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించబడుతుందని తెలిపారు. తప్పుడు సమాచారం అందించినందుకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న ఐటీ కంపెనీల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి అమెరికా కలలను నెరవేర్చుకోవడంలో భారతీయ విద్యార్థులు, ఐటీ నిపుణులు జాగ్రత్తగా ఉండాలి. అడ్డదారులు తొక్కితే జైలు పాలు కావడమే కాదు.. శాశ్వతంగా అమెరికా నుంచి గెంటేసే ప్రమాదం ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.