Begin typing your search above and press return to search.

అమెరికాలో తెలుగు వ్యక్తుల ఘరానా మోసం

By:  Tupaki Desk   |   30 March 2022 2:30 AM GMT
అమెరికాలో తెలుగు వ్యక్తుల ఘరానా మోసం
X
అమెరికాలోని అగ్ర కంపెనీలను ఓవైపు భారతీయ మేధావులు ఏలుతున్నారు. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలను శాసిస్తున్నారు. అయితే ఈ టెక్నాలజీని కొందరు అక్రమ మార్గాలకు ఉపయోగించి ఘరానా మోసాలు కూడా చేస్తున్నారు. తాజాగా అమెరికాలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా 1 మిలియన్ డాలర్లు అక్రమంగా ఆర్జించారు తెలుగు వ్యక్తులు. ఏడుగురు భారతీయులపై అమెరికన్ ఫెడరల్ అధికారులు కేసులు నమోదు చేయడం సంచలనమైంది.

కరోనా కల్లోలం సమయంలో 2020 మార్చి నుంచి మే నెలల్లో వర్క్ ఫ్రంహోం చేస్తున్న కొందరు తెలుగు వ్యక్తులు ఈ ఘరానా మోసానికి పాల్పడ్డారు.అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్ కోకు చెందిన ‘ట్విలియో’ క్లౌడ్ కంప్యూటింగ్ కమ్యూనియేషన్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న హరిప్రసాద్ సూరి, లోకేష్ లుగుడు, చోటు ప్రభుతేజ్ లు ఈ మోసానికి పాల్పడినట్టు తేల్చారు. వీరంతా తెలుగువారే కావడం గమనార్హం.

20202లో హరిప్రసాద్ కంపెనీ రహస్య వివరాలను తన స్నేహితుడు దిలీప్ కుమార్ రెడ్డికి, లోకేష్ తన గర్ల్ ఫ్రెండ్ కు, ప్రభుతేజ్ తన సోదరుడుకు లీక్ చేశారు. దీంతో ముగ్గురు స్నేహితులు కలిసి కంపెనీ రెవెన్యూ డేటా బేస్ యాక్సిస్ చేసి సమాచారం సేకరించారు. దీని ద్వారా కంపెనీ త్రైమాసిక ఫలితాల్లో ఈ వివరాలు వెల్లడిస్తే కంపెనీ షేర్లు పెరుగుతాయని అంచనావేశారు. కంపెనీ ఫలితాలు వెల్లడికి ముందే నలుగురు ట్విలియోలో స్టాక్స్ లో భారీ పెట్టుబడులు పెట్టారు. అనుకున్నట్టే ఫలితాలు వెల్లడించిన అనంతరం కంపెనీ షేర్లు భారీగా పెరిగిపోయాయి. దీంతో వీరంతా లాభాల బాటపట్టారు. ఒక్కసారిగా భారీగా పెరిగిన షేర్లపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్జేంచ్ కమిషన్ కు అనుమానం రావడంతో కంపెనీ షేర్లు, వివరాలు ఆరాతీశారు. దీంతో వీరు కంపెనీలో అక్రమాలకు పాల్పడినట్టు బయటపడింది.

కంపెనీ ట్రేడింగ్, షేర్లు వివరాలన్నింటిని వీరు తెలుగు లో ఎక్కువగా భారత్ నుంచి సంభాషించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ దర్యాప్తులో మొత్తం ఏడుగురు 1 మిలియన్ డాలర్లు అక్రమంగా సంపాదించారని తేలింది. దీంతో ఏడుగురిపై కేసులు నమోదు చేశారు.