Begin typing your search above and press return to search.

నేను రామ భక్తుడిని .. వృద్దులకు ఉచితంగా అయోధ్య ట్రిప్ : సీఎం

By:  Tupaki Desk   |   11 March 2021 6:00 AM GMT
నేను రామ భక్తుడిని .. వృద్దులకు ఉచితంగా అయోధ్య ట్రిప్ : సీఎం
X
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వయో వృద్దులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే ఢిల్లీ లోని సీనియర్ సిటిజన్స్ కి పలు శుభవార్తలు చెప్పిన సీఎం కేజ్రీవాల్ , తాజాగా మరో శుభవార్త చెప్పారు. ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన్ లో భాగంగా ఇప్పటికే ఢిల్లీ కి చెందిన సీనియర్ సిటిజన్స్ లను ఉచితంగా తీర్థయాత్రలకు పంపుతున్నారు. దీనిపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం ఇదే పథకాన్ని అయోధ్య ఆలయానికి కూడా వర్తింపజేయనున్నారు. అయోధ్య లో రామాలయ నిర్మాణం పూర్తి కాగానే .. ఈ ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన్ పరిధిలోకి అయోధ్య ఆలయాన్ని కూడా తీసుకువస్తాం అని తెలిపారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ... బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ తను రాముడి ఆశయాలను పాటిస్తున్నానని, అయోధ్యలో ఆలయ నిర్మాణం జరిగాక పెద్దవారిని, వృద్దులను అయోధ్యకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. తనను రాముడి, హనుమంతుడి భక్తుడిగా చెప్పుకున్నారు. అయోధ్యకు రాముడే రాజని అంటూ ఢిల్లీలో తన పాలనలో అంతా బాగుందని తెలిపారు. అసలు ఈ నగరంలో చింతలనేవే లేవని, అన్ని సౌకర్యాలూ ఉన్నాయని. దీన్నే రామ రాజ్యమని అంటారంటూ చెప్పారు. ఈ నగరంలో ఆహరం, విద్య, మెడికల్ కేర్, విద్యుత్, నీటి సరఫరా, ఉద్యోగాలు ఇలా అన్ని సదుపాయాలూ ఉన్నాయని ఆయన చెప్పారు. ధనికులైనా, పేదలైనా ఎవరైనా సరే మంచి నాణ్యమైన విద్య, వైద్య సౌకర్యం ఉండాల్సిందే అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఇలా తనను పరోక్షంగా రాముడిగా, ఢిల్లీ నగరాన్ని అయోధ్యతో పోలుస్తూ మాట్లాడారు. గత కొన్ని రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనతో అట్టుడికిన ఢిల్లీ ఈ మధ్య రైతుల నిరసనలు శాంతించడంతో ఢిల్లీ నగరం కొంచెం ప్రశాంతంగా ఉంది.