Begin typing your search above and press return to search.

హెల్మెట్ ఫ్రీ...అయితే ఒక‌టే ష‌ర‌తు

By:  Tupaki Desk   |   5 April 2016 5:30 PM GMT
హెల్మెట్ ఫ్రీ...అయితే  ఒక‌టే ష‌ర‌తు
X
తెలుగు రాష్ర్టాల్లో హెల్మెట్ ఉప‌యోగం, దాని ఆధారంగా జ‌రుగుతున్న రాద్దాంతం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. హెల్మెట్ పెట్టుకోకుంటే చ‌లాన్లా మోత మోగిపోతోంది. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు హెల్మెట్ పెట్టుకోమంటే వినరు. ట్రాఫిక్ పోలీసులు ఎంతమొత్తుకున్నా… అంతే. అస్సలు మార్పు రావ‌డం లేదు. కానీ ఈ ఆఫ‌ర్ చూస్తే హెల్మెట్‌ కు ఇంత క్రేజీ ఉందా అని అనిపించ‌క మాన‌దు.

ఏప్రిల్‌ 1 నుంచి బండి కొనుక్కున్న వారికి వాహనంతో పాటు ఫ్రీగా ఐఎస్‌ ఐ అప్రూవ్‌డ్‌ హెల్మెట్‌ ను ఇస్తామని కేరళ అధికారులు ప్ర‌క‌టించారు. ఇంతేకాకుండా నెంబర్‌ ప్లేట్ - రేర్‌ వ్యూ అద్దం - శారీ గార్డ్‌ - క్రాష్‌ గార్డ్‌ - హ్యాండిల్‌ గ్రిప్‌ లను కూడా అందిస్తామన్నారు. ఇవన్నీ ఫ్రీగానేనండోయ్‌. టూవీలర్ తయారీ సంస్థలతో ఆ రాష్ట్ర రవాణా శాఖ ఇటీవల సమావేశమైంది. ఆ సమావేశం తర్వాత వాటిని ఉచితంగా ఇచ్చేందుకు అంగీకరించారని రవాణా - రహదారి భద్రత కమిషనర్‌ టోమిన్‌ తెలిపారు. హెల్మెట్ గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో లాభం లేదనుకున్నారో ఏమో…బండి కొంటే హెల్మెట్ ఫ్రీ అంటూ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. క్రేజీ క‌దూ!