Begin typing your search above and press return to search.
జియో ప్రైమ్ పై కొత్త విశ్లేషణలు వస్తున్నాయి
By: Tupaki Desk | 22 Feb 2017 4:36 PM GMTభారతదేశ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ప్రవేశపెట్టిన రిలయన్స్ జియో మార్కెట్ లోకి వచ్చినప్పటి నుంచి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హైస్పీడ్ 4జీ డేటా - హెచ్ డీ వాయిస్ కాల్స్ - ఎస్ ఎంఎస్ లు - ప్రీమియం యాప్ సేవలు... వంటి సదుపాయాలన్నింటినీ ఉచితంగా అందివ్వడంతో వాటిని వాడుకునేందుకు మొబైల్ ఫోన్ యూజర్లు విపరీతమైన ఆసక్తి కనబరిచారు. జియో సిమ్ ల కోసం భారీ క్యూల్లో కూడా నిల్చున్నారంటే ఆ సర్వీస్ ఎంతగా పాపులర్ అయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో జియో దెబ్బకు ఇతర టెలికాం నెట్ వర్క్ లు అన్నీ కుదేలయ్యాయి. భారీ నష్టాలను చవి చూశాయి. అయితే అది పక్కన పెడితే మొన్నీ మధ్యే ఆ సంస్థ అధిపతి ముఖేష్ అంబానీ జియో యూజర్ల కోసం జియో ప్రైమ్ పేరిట కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. ఇంతకీ... అసలీ జియో ప్రైమ్ ను ఎలా పొందాలి..? దాంతో ఏమైనా లాభం కలుగుతుందా..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంతకీ జియో ప్రైమ్ అంటే ఏం లేదు. గతంలో జియో కొత్తగా వచ్చినప్పుడు డిసెంబర్ 31 - 2016 వరకు డేటా - వాయిస్ కాల్స్ - ఎస్ ఎంఎస్ లపై ఫ్రీ ఆఫర్ ను మళ్లీ కొనసాగిస్తూ మార్చి 31 - 2017 వరకు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పెట్టారు. ఈ ఆఫర్ ద్వారా ఇప్పటికే యూజర్లకు రోజుకు 1 జీబీ హై స్పీడ్ 4జీ డేటా - హెచ్ డీ వాయిస్ కాల్స్ - ఎస్ ఎంఎస్ లు - ఫ్రీ యాప్ యాక్సెస్ - అన్ లిమిటెడ్ నైట్ డేటా వంటి సేవలు లభిస్తున్నాయి. అయితే మార్చి 31, 2017 దాటితే ఈ ఆఫర్ ఉండదు కదా. మరి అప్పుడు కూడా ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కావాలనుకుంటే అందుకు జియో ప్రైమ్ ఉపయోగపడుతుందన్నమాట. అయితే ఇందుకోసం జియో ప్రైమ్ మెంబర్ షిప్ ను పొందాల్సి ఉంటుంది. జియో సేవలను ఇప్పటికే ఉపయోగిస్తున్న వారితోపాటు మార్చి 31, 2017లోపు ఆ నెట్ వర్క్ లో చేరే వారికి జియో ప్రైమ్ మెంబర్ షిప్ ఉంటుంది. అందుకు వారు ఏం చేయాలంటే మార్చి 1 - 2017 నుంచి మార్చి 31 - 2017 లోపు ఏ రోజైనా, ఎప్పుడైనా జియో యాప్ లేదా వెబ్ సైట్ లోకి వెళ్లి రూ.99 చెల్లించి జియో ప్రైమ్ మెంబర్ షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వారు ఆపై వచ్చే నెల... అంటే ఏప్రిల్ 1 నుంచి ముందు చెప్పినట్టుగా జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ను పొందుతారు. అంటే ఆ ఆఫర్ లో ఇప్పుడు లభిస్తున్నట్టుగానే రోజుకు 1జీబీ 4జీ డేటా - అన్ లిమిటెడ్ హెచ్ డీ వాయిస్ కాల్స్ - ఎస్ ఎంఎస్ లు - ప్రీమియం యాప్ లకు ఫ్రీ యాక్సెస్ - అన్ లిమిటెడ్ నైట్ డేటా వంటి సేవలను పొందుతారు. అయితే అలా పొందాలంటే యూజర్లు ఏప్రిల్ 1 నుంచి నెలకు రూ.303 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను మార్చి 31, 2017 తరువాత కూడా మళ్లీ సంవత్సరం పాటు అంటే మార్చి 31 - 2018 వరకు ఎంజాయ్ చేయవచ్చు.
కాగా, ఇప్పటికే మార్కెట్ లో ఉన్న ఇతర నెట్ వర్క్ కంపెనీలు వసూలు చేస్తున్న చార్జిల కన్నా జియో చార్జిలు చాలా అత్యల్పమనే టెలికాం యూజర్లు చెప్తున్నారు. ఎందుకంటే ప్రైమ్ మెంబర్ షిప్ కోసం జియో ముందస్తుగా రూ.99, ఆ తరువాత నెలకు రూ.303 వసూలు చేస్తోంది. అంటే సంవత్సరానికి అవన్నీ కలిపితే రూ.3735 అవుతుంది. దీన్ని ఒక రోజుకు చూసుకుంటే దాదాపుగా రూ.10 మాత్రమే పడుతుంది. అంటే రోజుకు కేవలం రూ.10 చెల్లిస్తే చాలు 1 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ నైట్ డేటా - కాల్స్ - ఎస్ ఎంఎస్ లు, ప్రీమియం యాప్స్ సేవలు పొందవచ్చు. ఇతర నెట్ వర్క్‌లతో చూసుకుంటే ఇది చాలా బెటరే అనిపిస్తుంది..! అయితే ప్రస్తుతం జియో సేవలను వాడే వారు ఇతర నెట్‌వర్క్ ఫోన్ నంబర్లకు చేస్తే కాల్స్ సరిగ్గా కనెక్ట్ అవడం లేదు. అందుకు కారణం ఏంటో అందరికీ తెలుసు. అన్ని నెట్‌వర్క్ కంపెనీలు జియోకు ఇంటర్‌కనెక్టివిటీ ఇవ్వడం లేదు. కానీ... ఈ సమస్య ఒక్కటి పరిష్కరించుకుంటే ఇక జియోకు తిరుగులేదని చెప్పవచ్చు.
ఇదంతా ఓకే..! మరి జియో ప్రైమ్ మెంబర్ షిప్ పొందకపోతే ఎలా..? అంటే... అప్పుడు వారు తమ వినియోగానికి అనుగుణంగా జియోలో ఉన్న ప్రీపెయిడ్ - పోస్ట్ పెయిడ్ ప్లాన్లను ఎంచుకోవాలి. కానీ... వాటి కన్నా జియో ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకుంటేనే ఎక్కువ లాభం పొందవచ్చని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/