Begin typing your search above and press return to search.

రైల్ల‌లో వైఫై..మెట్రోలో మ‌హిళ దొంగ‌లు

By:  Tupaki Desk   |   28 Dec 2016 4:56 AM GMT
రైల్ల‌లో వైఫై..మెట్రోలో మ‌హిళ దొంగ‌లు
X
మెట్రో రైల్‌ లో జ‌రుగుతున్న దొంగ‌త‌నాల్లో అనూహ్య రీతిలో మ‌హిళ‌లే అత్యంత టాప్‌ లో నిల‌వ‌డం షాక్‌ ను క‌లిగించే విధంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని మెట్రో రైల్ నెట్‌ వర్క్ పరిధిలో జేబు దొంగల్లో 91 శాతం మంది మహిళలేన‌ని పోలీసులు తేల్చారు. ఈ ఏడాది కేంద్రీయ పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ ఎఫ్) నిర్వహించిన 100 దాడుల్లో 479 మంది జేబుదొంగలను అరెస్ట్ చేసింది. వారిలో 438 మంది మహిళలేనని సీఐఎస్‌ ఎఫ్ పేర్కొంది. గతేడాది ఇది 93 శాతం కావడం గమనార్హం. ఇటీవల ఓ మహిళా దొంగల ముఠాను సీఐఎస్‌ ఎఫ్ పట్టుకున్నది.

ఇదిలాఉండ‌గా.... దేశంలో రద్దీగా ఉండే 100 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలు అందిస్తున్నామని రైల్వేశాఖ వర్గాలు తెలిపాయి. దక్షిణ భారతదేశంలోని కొల్లం రైల్వేస్టేషన్‌ కు ఉచిత వైఫై అందించడంతో 100 రైల్వేస్టేషన్‌ ల లక్ష్యాన్ని చేరుకోగలిగామని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వచ్చే ఏడాది చివరినాటికి 400 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై అందిస్తామని వెల్లడించారు. గూగుల్ సాయంతో రైల్వేశాఖ రైల్వేస్టేషన్లలో వైఫై అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాది జనవరిలో ముంబై సెంట్రల్ రైల్వేస్టేషన్‌ లో రైల్వేశాఖ తొలుత వైఫై సేవలను ప్రారంభించింది. ఆ తర్వాత భువనేశ్వర్ - బెంగళూరు - హౌరా - కాన్పూర్ - మథుర - అలీగఢ్ - బరేలి - వారణాసి రైల్వేస్టేషన్లలో వైఫైను రైల్వేశాఖ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రైల్వేస్టేషన్లలో ప్రతిరోజు కోటి మంది ప్రయాణికులు వైఫైతో వేగమైన ఇంటర్నెట్ సౌకర్యం పొందుతున్నారని, ప్రయాణంలో పుస్తకం - లేదా గేమ్ డౌన్‌ లోడ్ చేసుకొంటున్నారని ఆయన తెలిపారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/