Begin typing your search above and press return to search.
ఫ్రీడం ఫోన్ ఓనర్ల చెత్త లెక్క విన్నారా?
By: Tupaki Desk | 7 July 2016 8:24 AM GMTకేవలం రూ.251 ఇస్తే చాలు.. స్మార్ట్ ఫోన్ మీ సొంతం అంటూ ఆ మధ్యన ప్రచారం చేసి.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫ్రీడం ఫోన్ ఆ తర్వాతి కాలంలో ఎన్ని విమర్శలకు గురి అయ్యిందన్న విషయం తెలిసిందే. రూ.251 స్మార్ట్ ఫోన్ డెలివరీ చేస్తామన్న మాటను నమ్మి కొందరు ఫోన్ ను బుక్ చేయటం.. ఆ ఫోన్ డెలివరీని ఇప్పటికి మూడుసార్లు వాయిదా వేసిన సదరు కంపెనీ.. తాజాగా రేపు(శుక్రవారం) తమ ఫోన్ డెలివరీలు షురూ చేస్తామని చెప్పారు.
తొలి విడతలో 5వేల మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్లను అందించనున్నట్లు వెల్లడించారు. ఒక్కో ఫోన్ మీద తాము రూ.180 నుంచి రూ.270 వరకు నష్టాన్నిభరిస్తున్నట్లుగా చెప్పిన రింగింగ్ బెల్స్ కంపెనీ.. తమ యూజర్ల కోసం రూ.1 నుంచి రూ.3 మద్య 100కు పైగా కొత్త యాప్స్ ను సిద్ధం చేశామని.. వాటితో తాము నష్టపోయిన మొత్తం తిరిగి వస్తుందన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ సర్కారు డిజిటల్ ఇండియా ఫండ్స్ కు కేటాయించిన నిధుల నుంచి రూ.50వేల కోట్లు తమ సంస్థకు కానీ ఇస్తే.. దేశంలోని 75 కోట్ల మందికి రూ.251 కోట్లకే స్మార్ట్ ఫోన్ ఇస్తామంటూ తమ అసలు ప్లాన్ ను రింగింగ్ బెల్స్ కంపెనీ చెప్పుకొచ్చింది. రూ.50వేల కోట్ల భారీ మొత్తాన్ని ఏ కంపెనీకి ఇస్తే మాత్రం కోట్లాది ఫోన్లు ఇవ్వకుండా ఉంటారు. చూస్తుంటే.. రూ.251లకే ఫోన్ అంటూ భారీ మొత్తానికే టార్గెట్ చేసినట్లుగా అనిపించట్లేదు..?