Begin typing your search above and press return to search.
ఒవైసీ దెబ్బకు జనం కోమాలోకి వెళ్లిపోతున్నారు
By: Tupaki Desk | 18 March 2016 11:46 AM GMTఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ దెబ్బకు ఆంగ్లేయులతో పోరాడిన యోధులు కూడా కళ్లు తిరిగి కోమాలోకి వెళ్లిపోతున్నారు. ఒవైసీ దారుణమైన మాటలు విన్న ఓ స్వాతంత్ర్య సమరయోధురాలు షాక్ తో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వైద్యులు చికిత్స చేసిన తరువాత స్పృహలోకి వచ్చిన ఆమె మాట్లాడిన మొట్టమొదటి మాట కూడా అసదుద్దీన్ గురించే... ఒవైసీపై దేశ ద్రోహం కేసు పెట్టి విచారించాలి అని ఆమె అంది.
భారత్ మాతాకీ జై అని అనడానికి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ నిరాకరించిన విషయం తెలిసిందే. బీహార్ లోని గోపాల్ గంజ్ ప్రాంతానికి చెందిన రాసిదాన్ ఖాతూన్ అనే స్వాతంత్ర్య పోరాట యోధురాలు ఆ మాటలను గురువారం దూరదర్శన్ లో వార్తలు చూస్తూ విన్నారు. ఒవైసీ మాటలతో తీవ్ర ఆవేదనకు గురయిన ఆమె వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స చేసిన అనంతరం ఆమె స్ఫృహలోనికి వచ్చారు... అయితే... స్పృహలోకి రాగానే ఆమె తన కుమారుడిని పిలిచి ఒవైసీపై ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు. ఒవైసీని దేశ ద్రోహం నేరం కింద విచారించాలని అన్నారు. దీంతో తల్లి కోరిక మేరకు ఆమె కుమారుడు అన్సారీ గోపాల్ గంజ్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. తన తల్లి నిజమైన దేశభక్తురాలని అన్సారీ ఈ సందర్భంగా విలేకరులకు చెప్పారు.