Begin typing your search above and press return to search.

భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వెధవ్వేషాలు వద్దు

By:  Tupaki Desk   |   26 Feb 2016 11:02 AM GMT
భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వెధవ్వేషాలు వద్దు
X
భావప్రకటనా స్వేచ్ఛ హక్కు సంపూర్ణమైనది కాదని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. భావప్రకటనా స్వేచ్ఛ పేర బహిరంగ ప్రదేశాలలో అశ్లీల దృశ్యాలు చూస్తానంటే అంగీకారయోగ్యం కాదని పేర్కొంది.

గోప్యత హక్కు ఇంటర్నెట్ లో అశ్లీలవెబ్ సైట్లపై నిషాధానికి అవరోధంగా మారిందని ప్రభుత్వం రక్షణాత్మక వైఖరి తీసుకోవడం పట్ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గోప్యత ఏమిటి? ఎవరూ ఇంటర్నెట్ లో కనిపించాలని అనుకోరని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా - జస్టిస్ కే.సింగ్ లతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ ఏది అశ్లీలం, ఏది అనుతించదగినది అన్న విషయాల మధ్య స్పష్టమైన రేఖ ఉండాలని పేర్కొంది. మోనాలిసా కూడా అశ్లీల చిత్రమే అని భావించే వారుంటారని పేర్కొన్న సుప్రీం కోర్టు కళకు - అశ్లీలతకు మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉండాలని పేర్కొంది. అది కొంచం కష్టమైన పనే అయినా చేసి తీరాలని స్పష్టం చేసింది.

ఇంటర్నెట్ లో పొర్నోగ్రఫి సైట్లను నిషేధించాలన్న పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు అశ్లీల సైట్ల నిషేధం అన్నది అంతర్జాతీయ సహకారంతో జరగాలని పేర్కొంది. ఇందుకు ఇంటర్ పోల్ సహకారం కూడా అవసరమని పేర్కొంది.