Begin typing your search above and press return to search.

భారత్ కి మ‌రో పథకం ఖాయం చేసిన రెజ్ల‌ర్‌ .. ఎవరంటే ?

By:  Tupaki Desk   |   4 Aug 2021 10:43 AM GMT
భారత్ కి మ‌రో పథకం ఖాయం చేసిన రెజ్ల‌ర్‌ .. ఎవరంటే ?
X
టోక్యో ఒలంపిక్స్ లో బుధవారం భారత్ కి పథకాల పంట పడుతోంది. ఇప్పటికే భారత యువ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ కాంస్య పథకం గెలవగా, తాజాగా భారత్ కి మ‌రో మెడ‌ల్ ఖాయం చేశాడు రెజ్ల‌ర్ ర‌వికుమార్ ద‌హియా. బుధ‌వారం జ‌రిగిన‌ 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో క‌జ‌కిస్థాన్ రెజ్ల‌ర్ నూరిస్లామ్ స‌న‌యేవ్‌ పై అత‌డు గెలిచాడు. విక్ట‌రీ బై ఫాల్‌గా అత‌న్ని విజేత‌గా ప్ర‌క‌టించారు. ఈ విజ‌యంతో ఫైన‌ల్లో అడుగుపెట్టాడు ర‌వికుమార్‌.

రవి కుమార్ దూకుడు చూస్తుంటే భారత్ పసిడి ఖాయం అని అనిపిస్తుంది. ఒకవేలం ఫైనల్ లో ఏదైనా ఊహించనిది జరిగినా ఇండియా కు క‌నీసం సిల్వ‌ర్ మెడ‌ల్ మాత్రం ఖాయం. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సుశీల్‌కుమార్‌, యోగేశ్వ‌ర్‌ద‌త్‌లు మాత్ర‌మే ఇండియాకు సిల్వ‌ర్ మెడ‌ల్స్ అందించారు. వాళ్ల త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన మూడో రెజ్ల‌ర్‌గా ర‌వికుమార్ ద‌హియా నిలిచాడు. బుధ‌వారం ఉద‌యం నుంచి ర‌వికుమార్ మొత్తం బౌట్లు గెలిచి మెడ‌ల్ ఖాయం చేయ‌డం విశేషం. సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఒక ద‌శ‌లో ప్ర‌త్య‌ర్థి నూరిస్లామ్ 9-2 లీడ్‌ లోకి దూసుకెళ్లాడు. అయితే ఈ సమ‌యంలో ర‌వికుమార్ అత‌న్ని రింగ్ బ‌య‌ట‌కు తోసే క్ర‌మంలో నూరిస్లామ్ కాలికి గాయ‌మైంది. కాలికి క‌ట్టుకొని మ‌ళ్లీ రింగులోకి వ‌చ్చినా, అత‌డు ర‌వికుమార్ ప‌ట్టుకు నిలవ‌లేక‌పోయాడు. దీంతో రిఫ‌రీ ర‌వికుమార్‌ను విక్ట‌రీ బై ఫాల్ కింది విజేత‌గా ప్ర‌క‌టించాడు.

రవి దహియా క్వార్టర్ ఫైనల్‌ లో జార్జి వలెటినోవ్‌ ను 14-4 తేడాతో విజయం సాధించి సెమీస్ చేరాడు. ఇక దీపక్ పునియా చైనాకు చెందిన లిన్ జుషెన్‌ పై 6-3 తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్ చేరాడు. ఇక అన్షు మాలిక్ తొలి రౌండ్‌లో ఇర్యానా కురచికినాపై ఓడిపోయింది. అయితే ఇర్యానా కురచికినా సెమీస్ చేరడంతో రిపిచేజ్ రూల్ కారణంగా మూడో స్థానం కోసం పోరాడే అవకాశం వచ్చింది. 23 ఏళ్ల ర‌వికుమార్ తొలిసారి ఒలింపిక్స్‌ లో బ‌రిలోకి దిగాడు. మొద‌టి మ్యాచ్‌ లో ప్ర‌తి రౌండ్‌ లోనూ ర‌వికుమార్ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు. బౌట్‌ ను 13-2 స్కోర్ తేడాతో ద‌హియా మ్యాచ్‌ ను గెలిచాడు. 57 కేజీల పురుషుల రెజ్లింగ్‌ లో ర‌వికుమార్‌, ఆసియా చాంపియ‌న్‌. వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌ షిప్‌ లో బ్రాంజ్ మెడ‌ల్ కూడా గెలుచుకున్నాడు. ఆది నుంచి దూకుడు ప్ర‌ద‌ర్శించిన ద‌హియా, కొలంబియా రెజ్ల‌ర్‌ ను వ‌త్తిడిలో పెట్టాడు. సెకండ్ పీరియ‌డ్‌ లో టెక్నిక‌ల్ సుపీరియార్టీతో మ్యాచ్‌ ను 13-2 తేడాతో కైవ‌సం చేసుకున్నాడు. సెమీస్‌ లో క‌జికిస్తాన్‌ కు చెందిన నూర్ ఇస్లామ్ స‌నియోతో ర‌వికుమార్ త‌ల‌ప‌డి విజయం సాధించాడు.