Begin typing your search above and press return to search.

నాజూకు శృతి మించినా అక్కడ నేరమే

By:  Tupaki Desk   |   19 Dec 2015 4:12 AM GMT
నాజూకు శృతి మించినా అక్కడ నేరమే
X
నాజూగ్గా కనిపించటం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. బక్కగా ఉన్న అమ్మాయి సైతం.. మరింత నాజూగ్గా కనిపించాలనుకోవటం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఇక.. మోడలింగ్ రంగంలో ఉన్న వారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. జీరో సైజ్ కోసం కిందామీదా పడుతుంటారు. నోరు కట్టేసుకొని మరీ శరీరాన్ని కఠిన పరీక్షలకు గురి చేస్తుంటారు. నాజూగ్గా.. సన్నజాజి తీగలా ఉండాలనుకునే వారందరికి షాకిస్తూ.. తాజాగా ఫ్రాన్స్ చట్టాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి

దీని ప్రకారం.. మోడలింగ్ లో చేరాలనుకునే వారు తమ శరీర బరువుకు తగ్గట్లుగా ఉండాలే కానీ.. సన్నగా ఉండాలన్న తపనతో ఆరోగ్యానికి భంగం వాటిల్లేలా డైట్ తీసుకున్నా.. శరీరాకృతికి కోసం ప్రయత్నాలు చేసినా నేరంగా తేల్చారు. మోడలింగ్ లోకి వెళ్లాలనుకునే అమ్మాయిల బరువు ఆరోగ్యకరమైన రీతిలో ఉండాలని.. అందుకు సంబంధించిన సర్టిఫికేట్ ను వైద్యులు ఇవ్వాల్సి ఉంటుందని తేల్చారు. మోడలింగ్ కోసం బరువు తగ్గిపోతే తిప్పలు తప్పనట్లే. ఫ్రాన్స్ సర్కారు చేసిన తాజా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెబుతున్నారు. అవసరానికి మించి బరువు తగ్గే ఫ్రాన్స్ అమ్మాయిలకు.. అందునా మోడల్స్ పైన జరిమానాలు.. జైలుశిక్షలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.