Begin typing your search above and press return to search.

పొర‌పాటు చేశావ్ ట్రంప్ అని చెప్పేశాడు

By:  Tupaki Desk   |   2 Jun 2017 7:49 AM GMT
పొర‌పాటు చేశావ్ ట్రంప్ అని చెప్పేశాడు
X
అగ్ర‌రాజ్యానికి అధినేత‌గా ఉండేవారు.. అంత‌కంత‌కూ త‌న బ‌లాన్ని పెంచుకోవ‌టం.. త‌న మాట సాగేలా ప‌రిస్థితుల్ని మార్చుకోవ‌టం చేస్తుంటారు. కానీ.. అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. చివ‌ర‌కు త‌న మిత్రుల‌ను సైతం దూరం చేసుకుంటున్న ఆయ‌న తీరు ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది.

అమెరికాకు మిత్ర‌దేశ‌మైన ఫ్రాన్స్ తో స‌హా ప‌లు దేశాలు.. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నాయి. పారిస్ వాతావ‌ర‌ణ ఒప్పందం నుంచి అమెరికా వైదొల‌గ‌టంపై ప‌లువురు దేశాధినేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయ‌ల్ మేక్రాన్ చేరారు. పారిస్ ఒప్పందం నుంచి వైదొల‌గాలంటూ తీసుకున్న నిర్ణ‌యంలో ట్రంప్ పెద్ద పొర‌పాటు చేశార‌న్నారు.

"ట్రంప్.. మీరు పొర‌పాటు చేశారు. అమెరికా ప్ర‌జ‌ల ప‌ట్ల స‌రైన నిర్ణ‌యాన్ని తీసుకోలేక‌పోయారు. ఇది భావిత‌రం మీద ప్ర‌భావం చూపిస్తుంది. అమెరికా అధ్య‌క్షుడి నిర్ణ‌యంతో అసంతృప్తి చెందిన వారిని ఫ్రాన్స్ వెల్ కం చెబుతోంద‌న్న ఆయ‌న‌.. ట్రంప్ మాదిరి తామెప్ప‌టికీ ఈ ఒప్పందం నుంచి వెన‌క్కి త‌గ్గం" అంటూ స్ప‌ష్టం చేశారు.

పారిస్ ఒప్పందం నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యాన్ని కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో కూడా త‌ప్పు ప‌ట్టారు.అమెరికా తీసుకున్న నిర్ణ‌యం త‌న‌ను అసంతృప్తికి గురి చేసింద‌ని చెప్పారు. పారిస్ వాతావ‌ర‌ణ ఒప్పందాన్ని 190 దేశాలు అంగీక‌రించాయి. దీనికి అమెరికా మాజీ అధ్య‌క్షుడు ఒబామా త‌న ప‌ద‌వీ కాలంలో సంత‌కం చేయ‌గా.. తాజాగా ట్రంప్ వెన‌క్కి తీసుకోవ‌టంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/