Begin typing your search above and press return to search.
ఏపీలో 7822 పాజిటివ్ కేసులు...65 మంది మృతి
By: Tupaki Desk | 3 Aug 2020 3:36 PM GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఏపీలో గత వారం రోజులుగా దాదాపు 7 వేలకు పైచిలుకు కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా ఏపీలో 7822 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 45,516 శాంపిల్స్ పరీక్షించగా....7822 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,66,586 కి చేరుకుంది. గత 24 గంటల్లో 65 మంది కరోనా బారినపడి చనిపోగా....మొత్తం కరోనా మరణాల సంఖ్య 1537కి పెరిగింది. ఏపీలో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 1113 కరోనా కేసులు నమోదు కాగా....విశాఖ జిల్లాలో 1049, అనంతపురం జిల్లాలో 953 కేసులు నమోదయ్యాయి.
ఏపీలో గడిచిన 24 గంటల్లో విజయనగరంలో 677, కర్నూలులో 602, కడపలో 576, గుంటూరులో 573, నెల్లూరులో 500, శ్రీకాకుళంలో 495, పశ్చిమ గోదావరిలో 440, ప్రకాశంలో 364, కృష్ణాలో 240, చిత్తూరు జిల్లాలో 240 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, పశ్చిమ గోదావరిలో 11, విశాఖపట్నంలో 9, ప్రకాశంలో 8, నెల్లూరులో 7, శ్రీకాకుళంలో 7, విజయనగరంలో 4, చిత్తూరులో 3, కృష్ణాలో 3, కర్నూలులో 3, అనంతరపురంలో 2, తూర్పు గోదావరిలో 2, గుంటూరులో 2, కడప జిల్లాలో 2 కరోనా బారిన పడి చనిపోయారు. గత 24 గంటల్లో 5,786 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కావడంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 88,672కు చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 76,377 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21,10,923 కరోనా టెస్టులు చేశారు.