Begin typing your search above and press return to search.
మునిగిపోతుంటే రక్షించడం మాని వీడియో తీసిన యువకులు
By: Tupaki Desk | 18 Nov 2019 4:12 PM GMTకర్ణాటకలోని కలబుర్గి జిల్లా ఓ యువకుడి నీటిలో మునిగిపోతుంటే అతడి స్నేహితులు వీడియో తీసిన ఘటన సంచలనంగా మారింది. కలబుర్గి జిల్లాలోని మిజ్గురి ప్రాంతంలో ఓ క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ముగ్గురు మిత్రుల్లో ఒకరు ఒడ్డున నిలబడగా ఇద్దరు ఆ గుంతలో దిగారు. వారిలో ఒకరు కాసేపు ఈతకొట్టి బయటకు రాగా రెండో యువకుడు ప్రమాదవశాత్తు లోపలున్న రాయికి తగిలి గాయపడి బయటకు రాలేకపోయాడు. అయితే.. ఒడ్డున ఉన్న ఇద్దరూ మునిగిపోతున్న ఆ యువకుడికి చేయి అందించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయకపోగా మునిగిపోతున్న దృశ్యాన్ని వీడియో తీయడం మానవత్వానికి మచ్చగా మిగిలింది.
చనిపోయిన యువకుడిని జాఫర్ అయూబ్ గా పోలీసులు గుర్తించారు. ఈత కొడుతున్నది క్వారీ గుంత కావడంతో అందులో ఉన్న రాయిని గుర్తించకపోవడంతో అది బలంగా తగలడంతో నీళ్లలోంచి బయటకు రాలేకపోయాడు. అయితే, ఒడ్డున ఉన్న యువకుడు తొలుత చేయి చాపినప్పటికీ మళ్లీ చేతిని వెనక్కు తీసుకోవడం ఆ వీడియోలో కనిపించింది.
ఇదంతా జరుగుతుండగా మూడో యువకుడు మొత్తం వీడియో తీశాడే కానీ నీటిలో దిగి అయూబ్ ని కాపాడే ప్రయత్నం చేయలేదు. కళ్లెదుటే తోటి యువకుడు మునిగిపోతుంటే ఏమాత్రం మానవత్వం లేకుండా వదిలేయడమే కాకుండా వీడియో కూడా తీయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
వీడియో కోసం క్లిక్ చేయండి