Begin typing your search above and press return to search.
భయపెట్టేలా శ్రీలంకలో పెట్రోల్.. డీజిల్ ధరలు.. అసలు నిజం ఇది
By: Tupaki Desk | 12 March 2022 9:38 AM GMTనిన్నటి నుంచి మన పక్కనే ఉండే బుల్లి దేశం శ్రీలంకలో భారీగా పెట్రోల్.. డీజిల్ ధరలు పెంచేశారంటూ వచ్చిన వార్త ఒకటి అదే పనిగా వైరల్ అవుతోంది. రోజులో లీటరు డీజిల్ మీద 75 శ్రీలంక రూపాయిలు.. లీటరు పెట్రోల్ మీద 50 శ్రీలంక రూపాయిలు పెంచేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అయితే.. ఈ వార్త సాధారణ ప్రజల్లో విపరీతమైన ఆందోళనను పెంచటంతో పాటు.. ఈ లెక్కన మన దగ్గర ఎంత పెరుగుతుందన్న భయాందోళనలు మొదలయ్యాయి.
అయితే.. ఈ వార్తల్ని రాసినోళ్లకున్న పరిమితమైన మేధస్సు కారణంతో అనవసరమైన టెన్షన్ ను పుట్టించారని చెప్పాలి. నిజమే.. మనతో పోలిస్తే శ్రీలంకలో పెట్రోల్.. డీజిల్ ధరలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి.
అయితే.. అసలు వాస్తవం మాత్రం వేరే ఉందని చెప్పాలి. తాజాగా వచ్చిన వార్తల్ని చూసినప్పుడు.. వారం వ్యవధిలో శ్రీలంకలో భారీగా పెట్రోలు.. డీజిల్ రేట్లు పెరుగుతున్నాయని. దీనికి కారణం ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం ఒకటి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగిపోవటంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. దీనికి తోడు కరోనా కారణంగా శ్రీలంక పర్యాటకం మీద పడిన దెబ్బ మామూలుగా లేదు. ఇప్పుడా చిన్న దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనికి తోడు శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమై అమెరికా డాలర్ తో పోలిస్తే రూ.57కు తగ్గింది. ఇంత భారీగా శ్రీలంక రూపాయి విలువ పడిపోవటం.. వారం వ్యవధిలో రెండోసారి కావటంతో ముడి చమురు.. గ్యాసోలిన్ ఉత్పత్తుల ధరల మీద ప్రభావం చూపించింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొన్ని లెక్కల్ని పరిగణలోకి తీసుకోకపోవటంతో.. శ్రీలంకలో భారీగా పెట్రోల్.. డీజిల్ ధరలు పెరిగినట్లుగా వచ్చిన వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు నిజాన్ని చూసినప్పుడు నేటికి శ్రీలంకలోని పెట్రోల్.. డీజిల్ ధరలు మన కంటే తక్కువన్న విషయాన్ని చెబితే ఎవరూ నమ్మరం. కానీ.. లెక్కలు జాగ్రత్తగా వేసుకొని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.
ప్రస్తుతం శ్రీలంకలో లీటరు పెట్రోల్ రూ.254 (శ్రీలంక రూపాయిల్లో).. అదే సమయంలో లీటరు డీజిల్ ధర రూ.214 (శ్రీలంక రూపాయిల్లో) . ఈ అంకెలు చూస్తే అర్థం కావట్లేదా? మన ధరలకు వారికి ఏమైనా పోలిక ఉందా? అని కాస్తంత ఆవేశంతో ప్రశ్నించొచ్చు. కానీ.. సరిగా ఆలోచన చేస్తే.. మన కంటే అక్కడి ధరలు తక్కువ. అదెలానంటే.. మన రూపాయికి శ్రీలంకలో ఇచ్చే వారి రూపాయిలు అక్షరాల 3.32. అంటే మనం ఇండియన్ కరెన్సీ పది రూపాయిలు ఇస్తే.. వ్రీలంక రూపాయిలు 33.20 ఇస్తారన్న మాట. ఈ లెక్కన ప్రస్తుతం శ్రీలంకలో లీటరు పెట్రోల్ ఎంత? 254. అది కూడా శ్రీలంక రూపాయిల్లో. దాన్ని మన రూపాయిల్లోకి కన్వెర్ట్ చేసి చూస్తే.. 76.50. మరి మన దగ్గర ఎంత? లీటరు పెట్రోల్ దాదాపు రూ.108 వరకు ఉంది. అంటే.. శ్రీలంక రూపాయిల్లో 358.56 పైసలుగా ఉండాలి. మరిప్పుడు చెప్పండి? మన కంటే శ్రీలంకలో పెట్రోల్ ధర ఎక్కవా? తక్కువా?
అదే విధంగా లీటరు డీజిల్ లెక్కను చూద్దాం. ప్రస్తుతం శ్రీలంకలో అక్కడి కరెన్సీ ప్రకారం 214. దీన్ని మన కరెన్సీలో మార్చి చూస్తే 64.45కు సమానం. మరి.. మన దగ్గర (హైదరాబాద్ లెక్క తీసుకుందాం) లీటరు డీజిల్ ఎంత ఉంది? దగ్గర దగ్గర రూ.98 వరకు ఉంది. ఈ మొత్తాన్ని శ్రీలంక రూపాయిల్లోకి మార్చి చూద్దాం. 98×3.32 (మన ఒక రూపాయికి శ్రీలంక రూపాయిలు 3.32 వస్తాయి) రూ.325. ఇదంతా చూసిన తర్వాత.. లీటరు పెట్రోల్.. డీజిల్ ధరలు మన దగ్గర ఎక్కువ? శ్రీలంకలో ఎక్కువ? అన్న ప్రశ్న వేసుకుంటే అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. లీటరు పెట్రోల్.. డీజిల్ మీద ఒక్కసారిగా భారీగా పెంచేయొచ్చు. కానీ.. అంత పెంచినప్పటికి మనతో పోలిస్తే.. వారి ధరలు తక్కువగా ఉన్నాయన్న విషయం అర్థమవుతుంది. అంటే.. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ.. శ్రీలంకతో పోల్చి చూసినా.. మన దగ్గర ధరలు పెంచాల్సిన అవసరం లేదు. అందుకే.. వాట్సాప్ లో వైరల్ అయ్యే వార్తలు.. వాటిని చూసి.. లాజిక్ మిస్ అయి వాటినే రాసేసే ప్రధాన మీడియా ఇచ్చే కొన్ని వార్తల్ని పరిగణలోకి తీసుకోకపోవటమే మంచిది.