Begin typing your search above and press return to search.
అరకు నుంచి హైద్రాబాద్ వరకు.. గంజాయిని ఇలా రవాణా చేస్తారు..
By: Tupaki Desk | 26 May 2022 11:30 PM GMTఓ సంచి.. అందులో మహిళలు, పిల్లల దుస్తులు.. ఇంటికి సంబంధించిన కొంత సామగ్రి.. ఇలాంటి సంచులు చేతిలో పట్టుకున్న మహిళలను పోలీసులు చాలా వరకు తనిఖీలు చేయకుండా ఉంటారు. మహిళల దుస్తుులు కనిపించేసరికి కొంచెం మోహమాటంగా ఫీలయి వదిలేస్తారు. కానీ ఈ అవకాశాన్ని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇలాంటి వారిచేత గంజాయిని నగరాలకు చేరవేరుస్తున్నారు. కొందరు పోలీసులు ఎందుకైనా మంచిదని మహిళల సంచులను తనిఖీలు చేశారు. దీంతో ఆ సంచుల్లో గంజాయి ప్యాకెట్లు లభించాయి. వెంటనే వాటిని తీసుకొస్తున్న మహిళలు, యువతులను పోలీసులు విచారించారు. తమ కుటుంబ పోషణ కోసమే ఈ పని చేశామని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గంజాయి రవాణా చేయిస్తున్నవారి కోసం పోలీసులు అన్వేషించడం మొదలుపెట్టారు.
ఇటీవల గంజాయి సప్లయి చేస్తున్న కొందరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ పరిధిలోని మూడు పోలీస్టేషన్ల పరిధిలో గంజాయితో పట్టుబడిన మహిళలను పోలీసులు విచారించారు. అయితే వారికి ఎటువంటి నేర చరిత్ర లేదని తేల్చారు. కుటుంబ పోషణ కోసమే ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలిపారు. కొందరు స్మగ్లర్లు మహిళలతో కలిసి గ్రూపులను ఏర్పాటు చేసి వారిలో ఇద్దరు యువతులను ఉంచి గంజాయి సప్లయి చేయిస్తున్నారు.
ఇలా సప్లయి చేస్తున్న ఒక్కో మహిళకు రూ.4000 నుంచి రూ.5000వరకు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో నెలపాటు కష్టపడితే వచ్చే సొమ్ము 2 నుంచి 3 రోజుల్లో వచ్చేసరికి చాలా మంది యువతులు గంజాయి రవాణా చేయడానికి ఒప్పుకుంటున్నారు.
తెలంగాణ, ఏపీకి చెందిన స్మగ్లర్లు ఎక్కువగా మహిళలతోనే గంజాయి సప్లయి చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేట్ వాహనాల్లో గ్రూపులుగా ఏర్పడిన వారిని అరకు, విశాఖపట్టణం, చింతపల్లి, రాజమహేంద్రవరం ప్రాంతాలకు తీసుకెళ్తారు. అక్కడ గంజాయి ప్యాకెట్లను తమ సంచుల్లో సర్దుకున్నాక.. వాటిపై మహిళల దుస్తులు.. పిల్లల దుస్తులు కప్పేస్తారు. ఆ తరువాత వీరిని ఆర్టీసీ బస్ స్టాండుల్లో.. రైల్వే స్టేషన్లకు తరలిస్తారు. ప్రయాణ మార్గంలో పోలీసులు ఎదురైనట్లయితే ఆ సంచులను అక్కడే వదిలేసి వెళ్తారు.
ఇలా రవాణా చేస్తున్న వారిని హైదరాబాద్ రాకముందే మౌలాలి లాంటి ప్రాంతాల్లో ఇక్కడివారు రిసీవ్ చేసుకుంటారు. అయితే కొందరు మహిళలు యువతులు ఉన్న ఈ గ్రూపులో వారికి ఎస్కార్టుగా ఉన్న యువతికి రూ.20000 నుంచి 25 వేల వరకు ఇస్తారు.
ఎవరికీ అనుమానం రాకుండా ఇలా గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఇటీవల మేడ్చల్ కు చెందిన ఓ మహిళ పట్టుబడడంతో ఆమె నుంచి పోలీసులు వివరాలు సేకరించినట్లు సమాచారం.