Begin typing your search above and press return to search.
ఎలాన్ మస్క్ నుంచి బెజోస్ దాకా.. బిలియనీర్లకు భారీ షాక్
By: Tupaki Desk | 14 Sep 2022 4:17 PM GMTఅమెరికా మాంద్యం ప్రపంచంలోనే అపర కుబేరులను సైతం దివాలా తీయిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్న తీరు చూస్తే మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఊహించినదానికంటే ఎక్కువగా నమోదైన అధిక ద్రవ్యోల్బణం కారణంగా అక్కడి మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఫలితంగా భారీగా ఫెడ్ వడ్డింపు రేట్లు తప్పదనే భయాలు వెంటాడాయి.
ఈ క్రమంలోనే అమెరికాలోని అత్యంత సంపన్న బిలియనీర్ల సంపదన మంగళవారం 93 బలియన్ డాలర్ల మేర పడిపోయింది. ఇది 9వ అత్యంత దారుణమైన రోజు అని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అమెరికా కుబేరుల సంపద భారీగా తుడిచిపెట్టుకుపోయింది. ముఖ్యంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపద ఒక్కరోజులోనే రూ.80వేల కోట్లు (9.8 బిలియన్ డాలర్లు) కోల్పోయారు.
ఇక ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలాన్ మస్క్ నికర విలువలో రూ.70వేల కోట్లు (8.4 బిలియన్ డాలర్లు) పడిపోయింది. ఇక మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ , లారీపేజ్, సెర్గీ బ్రిన్, స్టీవ్ బాల్మెర్ లు ఇదే బాటలో పయనించారు.వీరి సంపద మొత్తం 4 బిలియన్ డాలర్లకు పైగా క్షీణించింది.
టాప్ 10 జాబితాలోని ఇతర బిలియనీర్లు వారెన్ బఫెట్, బిల్ గేట్స్ వరుసగా 3.4 బలియన్ డాలర్లు, 2.8 బిలియన్ డాలర్లను కోల్పోయారు.
అమెరికా వినియోగదారుల ధరల సూచి (ద్రవ్యోల్బణం) ఏడాదితో పోలిస్తే 8.3 శాతం మేర పెరిగింది. ఇది 8.1 శాతంగా ఉంటుందని నిపుణులు అంచనావేశారు. దీంతో ఇది మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో గత ఐదురోజుల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.