Begin typing your search above and press return to search.
స్కూలు బ్యాగుల్లో కత్తులు-సిగరెట్లు-పోర్న్ మ్యాగజైన్లు!
By: Tupaki Desk | 23 Jan 2018 12:30 AM GMTసిగరెట్లు - లైటర్లు - గుట్కాలు - సెక్స్ మ్యాగజైన్లు - ఐపాడ్లు - మొబైల్ ఫోన్లు.. ఇవి ఎక్కడున్నాయో తెలిస్తే...షాకవుతారు. విద్యార్థుల దగ్గర. ఇంతటితోనే..అవాక్కవకండి. ఇది జరిగింది మనదేశంలోనే! లక్నోలోని టాప్ స్కూళ్ల పిల్లల బ్యాగుల్లో దర్శనమిచ్చినవి. పుస్తకాలు ఉండాల్సిన బ్యాగుల్లో వీటిని చూసి అక్కడి అధికారులు కళ్లు తేలేశారు. అది కూడా ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల వద్ద!
ఇటీవల లక్నోలోని బ్రైట్ లాండ్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిపై ఆరో తరగతి విద్యార్థిని కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిటీలోని పన్నెండు టాప్ స్కూళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల బ్యాగులను చెక్ చేస్తే ఈ విస్తుపోయే వస్తువులు బయటపడ్డాయి. ఓ 9వ తరగతి విద్యార్థి దగ్గర సైన్స్ సబ్జెక్ట్ అని రాసిన బుక్ చెక్ చేస్తే అది పోర్న్ మ్యాగజైన్ అని తెలిసింది. మరికొందరి దగ్గర సిగరెట్లు - లైటర్లు - గుట్కాలు దొరికాయి!మరికొందరి దగ్గర రేజర్లు - షేవింగ్ ఫోమ్స్ కూడా దొరికాయి. ఇంట్లో షేవింగ్ చేసుకోనివ్వరని, అందుకే వాటిని స్కూళ్లకు తీసుకొస్తున్నట్లు వాళ్లు చెప్పడం విశేషం.
అయితే మరిన్ని ట్విస్టులు కూడా ఇందులో ఉన్నాయి. గర్ల్స్ హైస్కూల్ లోనూ ఈ బ్యాగుల తనిఖీలు జరిగాయి. వాళ్ల బ్యాగుల్లో కత్తెర్లు - బ్లేడ్లు - నెయిల్ పాలిష్ లు - లిప్ స్టిక్స్ - పర్ఫ్యూమ్స్ బయటపడ్డాయి. కొందరి దగ్గర ఐపాడ్లు - మొబైల్ ఫోన్లు వాటిని సీజ్ చేశారు. ఇవి చాలా తీవ్రమైనవి కావడంతో ఆయా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాం అని ఓ స్కూల్ టీచర్ చెప్పారు. షాకింగ్ వస్తువులు బయటపడటంతో అటు స్కూళ్లు - ఇటు పేరెంట్స్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టంచేశారు.