Begin typing your search above and press return to search.

సిక్కోలు గడ్డ నుంచి.. బెజవాడ మొదటి బిడ్డగా..

By:  Tupaki Desk   |   19 March 2021 5:30 AM GMT
సిక్కోలు గడ్డ నుంచి.. బెజవాడ మొదటి బిడ్డగా..
X
ఏపీలో జగన్ సర్కార్ కొలువుదీరాక.. ఆయన సొంత సామాజికవర్గాన్ని పక్కనపెట్టి మరీ బీసీలు, అణగారిన వర్గాలకు పెద్ద పీట వేశారు. మంత్రివర్గంలోనూ బలమైన అగ్రవర్ణాల నేతలను పక్కనపెట్టి మరీ అగ్రతాంబూలం పేదవర్గాల నేతలకే కల్పించారు. ఆ కోవను మున్సిపల్ ఎన్నికల్లోనూ చూపించారు.

తాజాగా విజయవాడ కార్పొరేషన్ మేయర్ గా ఎవరు ఎన్నికయ్యారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. విజయవాడ ప్రథమ పౌరురాలు ఉత్తరాంద్రకు చెందిన శ్రీకాకుళంలో పుట్టిన ఆడబిడ్డ కావడం గమనార్హం.

విజయవాడ మేయర్ పదవి స్థానికంగా బలమైన రెండు సామాజికవర్గాల మధ్యనే కొనసాగేది. ప్రతిసారి వారే పదవులు అలంకరించేవారు. కానీ జగన్ మాత్రం బలహీనవర్గాలకే ఆ పదవి కేటాయించి సంచలనం రేపారు. శ్రీకాకుళం నుంచి మెట్టినిల్లు విజయవాడకు వచ్చిన మహిళకే విజయవాడ మేయర్ పీఠం వరించింది.

కృష్ణా, గుంటూరు నుంచి ఉత్తరాంధ్రకు వెళ్లి పోటీచేసి పదవులు అనుభవిస్తున్న ఈ రోజుల్లో అక్కడి నుంచి వచ్చి రాజధాని ప్రాంత కీలక నగరం మేయర్ గా సిక్కోలు ఆడబిడ్డ ఎంపిక కావడం అక్కడి ప్రజలను సంతోషపరిచింది. ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న బలమైన సామాజికవర్గాలను కాదని.. ఈమెకు మేయర్ పీఠం కట్టబెట్టి జగన్ షాకింగ్ నిర్ణయమే తీసుకున్నారని చెప్పొచ్చు.