Begin typing your search above and press return to search.

నిఫా వైరస్ గుట్టు వీడింది..కేంద్రం ప్రకటన

By:  Tupaki Desk   |   3 July 2018 11:19 AM GMT
నిఫా వైరస్ గుట్టు వీడింది..కేంద్రం ప్రకటన
X
నిఫా వైరస్ మిస్టరీ వీడింది. కేరళ రాష్ట్రంలో వ్యాపించి 17మంది మృతికి కారణమైన ఈ వైరస్ ఎలా వ్యాపించిందనే విషయాన్ని భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఐఎంసీఆర్) తేల్చింది. గబ్బిలాలు తిన్న పండ్లను మనుషులు తినడం వల్లనే ఈ వ్యాధి వ్యాపించిందని పరిశోధనలో నిరూపితమైంది. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ - మల్లాపురం జిల్లాలోనే ఎక్కువమంది ఈ వైరస్ వల్ల మృతిచెందారు..

ఈ మరణాలు ఉదృతమయ్యాయక వైద్య పరిశోధన సమాఖ్య కేరళలోని కోజికోడ్ లోని చంగారోత్ గ్రామంలో పర్యటించింది. అక్కడి గబ్బిలాలను పట్టుకొని పరిశోధించింది. ఆ గబ్బిలాల్లో నిఫా వైరస్ ను గుర్తించారు. ఈ వైరస్ సోకిన గబ్బిలాలు తిన్న పండ్లను స్థానికులు తినడం వల్లే ఈ వైరస్ వారికి సోకిందని తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.

అయితే నిఫా వైరస్ సోకి దాదాపు రెండు నెలలు కావస్తోంది. ఈ వైరస్ కొత్తది కావడం.. పరికరాలు అందుబాటులో లేకపోవడంతో దీన్ని నిర్ధారించేందుకు కాస్త ఎక్కువ సమయం పట్టిందని కేంద్రమంత్రి తెలిపారు. తొలిసారిగా 21 గబ్బిలాలను పట్టుకున్న పరిశోధకులు వాటిని పరిశీలించి వాటిలో నిఫా వైరస్ లేదని తేల్చారు. ఆ తర్వాత రెండో దఫాలో 55 గబ్బిలాలను పట్టుకొని పరిశోధించగా అందులో పండ్లను తినే గబ్బిలాల్లో నిఫా వైరస్ ఉన్నట్టు గుర్తించారు..

తాజాగా కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ మల్లాపురంలో జిల్లాలో నిఫా వైరస్ లేదని.. పూర్తిగా తగ్గిపోయిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జూన్ 1 తరువాత నిఫా వైరస్ కేసులు ఎక్కడా నమోదు కాలేదని ప్రకటన చేసింది.