Begin typing your search above and press return to search.
పార్లమెంటులో వైఎస్సార్సీపీ ఎంపీల ఫ్రస్టేషన్!
By: Tupaki Desk | 21 July 2022 10:44 AM GMTఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ వర్సెస్ వైఎస్సార్సీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుగా సాగుతున్న పోరు పార్లమెంటుకు ఎక్కింది. జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఇప్పటికే అనేకమార్లు రఘురామ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా జరుగుతున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనూ రఘురామరాజు ఆ విషయాన్ని లేవనెత్తారు. దీంతో వైఎస్సార్సీపీ ఎంపీలు ఆయనను అడ్డుకున్నారు.
ఏపీలో కార్పొరేషన్ల పేరుతో రుణాల సేకరణపై ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రస్తావించారు. దీంతో ఆయనను వైఎస్సార్సీపీ ఎంపీలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీలు, రఘురామల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకొని నిధులను మళ్లిస్తోందని రఘురామ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ పేరుతో రుణాలు తీసుకుంటున్నారని, ఏపీ మూలనిధికి నిధులను జమ చేయడం లేదని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత రఘురామ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఏపీ ప్రభుత్వం కార్పరేషన్ల పేరుతో రుణాలను సేకరిస్తుందనడానికి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని రఘురామ అన్నారు. ఏపీ ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకునేందుకు ప్రత్యేక జీవోను కూడా తెచ్చిందని సభాపతి దృష్టికి తెచ్చారు.
ఆ నిధుల్ని కూడా ఇతరత్రా అవసరాల కోసం మళ్లిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో రఘురామ ప్రసంగాన్ని వైఎస్సార్సీపీ ఎంపీలు పదే పదే అడ్డుకున్నారు. దీంతో సహనాన్ని కోల్పోయిన రఘురామ... సిట్ డౌన్ అంటూ వారిపై అరిచారు. తమను కూర్చోమని చెప్పడానికి రఘురామ ఎవరంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు వివాదానికి దిగారు.
దీంతో స్పీకర్ స్ధానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ వారిని వారించారు. అయినా వారు వినిపించుకోలేదు అదే సమయంలో రఘురామ కూడా వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో సభాధ్యక్ష స్ధానాన్ని ఉద్దేశించి మాట్లాడాలని రఘురామకు సూచించారు. దీంతో ఆయన తన అరచేతిని అడ్డుపెట్టుకుని మరీ మాట్లాడారు. తాను స్పీకర్ ను ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నట్లు చెప్పారు.
2019 పార్లమెంటు ఎన్నికల్లో నరసాపురం నుంచి వైఎస్సార్సీపీ ఎంపీగా రఘురామకృష్ణరాజు గెలిచారు. ఆ తర్వాత కొద్ది కాలానికే తీవ్ర విబేధాలతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘురామపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే ఎంపీలు పలుమార్లు లోక్ సభ స్పీకర్ కు వినతిపత్రం ఇచ్చారు. మరోవైపు ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో స్థానిక ఎంపీగా తనను పాల్గొనకుండా చేశారని రఘురామ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో తరచూ సోషల్ మీడియా, వివిధ యూట్యూబ్ చానెళ్లు, టీవీ చానెళ్లకు ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడుతున్నారు.