Begin typing your search above and press return to search.
తాలిబన్లలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా ?
By: Tupaki Desk | 27 Aug 2021 5:30 AM GMTఆఫ్ఘనిస్ధాన్ కాబూల్ విమానాశ్రయం బాంబులపేలుడుతో దద్దరిల్లిపోయింది. గురువారం రాత్రి హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం టేకాఫ్ కాగానే సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చేసుకోవటం సంచలనంగా మారింది. కొన్ని వందలమంది ప్రయాణీకులు వెయిట్ చేస్తుండగా, అమెరికా ఉన్నతాధికారులు, జర్నలిస్టులు ఎక్కిన విమానం టేకాఫ్ లో ఉండగానే మానవబాంబు తనను తాను పేల్చుకోవటం దేనికి సంకేతమో అర్ధం కావటంలేదు.
అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారుల అంచనా ప్రకారం తాలిబన్లలో పెరిగిపోతున్న అసహనానికి నిదర్శనం. ఎయిర్ పోర్టులోని అబ్బే ప్రధాన గేటు దగ్గర ఒకసారి బేరన్ హోటల్ దగ్గర రెండోసారి మానవబాంబులు పేలాయి. దాంతో విమానాశ్రయంలో ఏమి జరిగిందో చాలాసేపు ఎవరికీ అర్ధంకాలేదు. ఎందుకంటే ముందు కాల్పులు జరగటం వెంటనే బాంబులు పేలటంతో అక్కడి ప్రాంతమంతా గందరగోళంగా తయారైంది. ఈ పేలుడులో 72 మంది చనిపోగా 143 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సరే దేశమంతా తాలిబన్ల చేతిలోనే ఉన్న తర్వాత ఇక కాల్పులకైనా, మానవబాంబులకైనా ఏమి అవసరం ? ఏమిటంటే పాలనాధికారం తాలిబన్ల చేతిలోకి వచ్చినా జనాలు మాత్రం దాన్ని ఆమోదించటంలేదు. పరిమితసంఖ్యలోనే అయినా ఎక్కడికక్కడ జనాలు తీవ్రంగానే ఉగ్రవాదులను వ్యతిరేకిస్తున్నారు. ఒకపుడు తాలిబన్లకు ఎదురుపడాలంటేనే భయపడే జనాలు ఇపుడు బహిరంగంగానే తిరుగుబాటు చేస్తున్నారు.
తిరుగుబాటుదారుల్లో ప్రధానంగా మహిళలు కూడా పెద్దఎత్తున పాల్గొనటాన్ని తాలిబన్లు అస్సలు సహించలేకపోతున్నారు. ఒకవైపు ఎదురుతిరిగినవారిని కాల్చి చంపుతున్నా భయపడకుండా జనాలు ప్రతిరోజు రోడ్లమీదకు రావటాన్ని తాలిబన్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాలిబన్లు అమలుచేస్తున్న షరియా చట్టాలను ఏమాత్రం ఆమోదించేది లేదని జనాలు తమ ఆందోళనల్లో తెగేసి చెబుతున్నారు. ఆడ, మగ తేడాలేకుండా తమకు స్వేచ్చా, స్వాతంత్ర్యాలు కావాలంటు నానా గోల చేస్తున్నారు.
ఇదే సయంలో నాలుగు జిల్లాల్లో జరిగిన తిరుగుబాటులో సుమారు ఓ కమాండర్ తో కలిపి 20 మంది తాలిబన్లను పంజ్ షీర్ల మద్దతుతో జనాలు చంపేశారు. ఈ ఘటన తాలిబన్లకు పుండుమీద కారం రాసినట్లయ్యింది. పాకిస్ధాన్, చైనా నుండి తప్ప బహిరంగంగా ప్రపంచదేశాలు తమను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటాన్ని తాలిబన్లు సహించలేకపోతున్నారు. ఇంటా, బయట తమకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలతో తాలిబన్లలో అసహనం పెరిగిపోతోంది. దీనికి నిదర్శనమే ప్రతిరోజు జనాలను చంపేయటం, అత్యాచారాలు చేయటం. చివరకు ఇది మానవబాంబ పేల్చుకునేంతవరకు చేరుకుంది. మరి రేపేమవుతుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది.