Begin typing your search above and press return to search.

మ్యాగీ మాత్రమే కాదు.. మిగతావాటికీ పరీక్షలు!

By:  Tupaki Desk   |   9 Jun 2015 5:35 AM GMT
మ్యాగీ మాత్రమే కాదు.. మిగతావాటికీ పరీక్షలు!
X
భారత ఆహార భద్రత. ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎల్‌ఏఐ) నిద్ర లేచింది. మ్యాగీ లో లెడ్‌ అధిక మోతాదుని గుర్తించి దాని వల్ల మ్యాగీని తినే వాళ్ల ఆరోగ్యానికి జరిగే అనార్థాలను గుర్తించి నిసేధం విధించేయడం జరిగింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మ్యాగీపై నిషేధం విధించేశాయి.

మరి అనర్థాలు కేవలం మ్యాగీ వల్ల మాత్రమే కాదు.. అనేక రకాల ఫాస్ట్‌ఫుడ్‌ల వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు ఉంటాయనేది అందరూ ఎరిగిన విషయమే. ఇలాంటి నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మిగతా వాటి మీద కూడా దృష్టి పెట్టింది. మ్యాగీ మాత్రమే కాకుండా ఇతర కంపెనీలకు చెందిన ఫాస్ట్‌ఫుడ్‌, పాస్తాలపై కూడా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ మేరకు అన్ని ప్రముఖ కంపెనీల ఇన్‌స్టెంట్‌ ఫుడ్‌కు కూడా పరీక్షలు తప్పేలా లేవు. నెస్లే ఇండియాకు చెందిన ఇతర ఆహారోత్పత్తులు, ఇండోనిసాన్‌ ఫుడ్‌ లిమిటెడ్‌, జీఎస్‌కేకంజూమర్‌, రుచి ఇంటర్నేషనల్‌ తదితర కంపెనీల ఆహారోత్పత్తులకు పరీక్షలు నిర్వహించాలని ఈ ప్రభుత్వ రంగ సంస్థ నిర్ణయించింది.

వాయ్‌వాయ్‌ నూడుల్స్‌, భుజియా చికెన్‌ స్నాక్స్‌, ఐటీసీకి చెందిన ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ యమ్మీ వెజ్‌ నూడుల్స్‌ తదితర వాటిని పరీక్షించనున్నట్టుగా తెలుస్తోంది.

బాగా పాపులర్‌ అయిన నెస్లే ఇలా దొరికిపోయింది. దాని వల్ల అనర్థాలు ఉంటాయని స్పష్టం అయ్యింది.మరి పేరున్న మిగతా ఇన్‌స్టంట్‌ ఫుడ్స్‌ కథేంటో!