Begin typing your search above and press return to search.
కరివేపాకు 'విషం' అయ్యిందట!
By: Tupaki Desk | 19 Nov 2019 1:30 AM GMTకూరలోనైనా.. పప్పులోనైనా.. సాంబారులోనైనా కరివేపాకు వేయడంతో మంచి రుచి వస్తుంది. కరివేపాకు కేవలం రుచికి మాత్రమే కాకుండా మంచి ఆయుర్వేద ఔషదంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకును ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. బి విటమిన్.. కాల్షియం.. ఫాస్ఫరస్.. పిండి పదార్థాలు.. కొవ్వు పదార్థాలు.. ప్రోటీన్లు ఇలా అన్ని కూడా మానవ శరీరంకు అద్బుతంగా ఉపయోగపడతాయి. ప్రతి రోజు రెండు పచ్చి కరివేపాకులను తినడం వల్ల అజీర్తి సమస్యతో పాటు మలబద్దకం కూడా దూరం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాంటి కరివేపాకు గురించి ఎఫ్ ఎస్ ఎస్ ఏఐ సంస్థ షాకింగ్ విషయం వెళ్లడించింది.
కరివేపాకులో అన్ని ఔషదగుణలు ఉన్నమాట వాస్తవమే కాని.. అదే కరివేపాకు ప్రస్తుతం విషతుల్యం అయ్యిందని.. ప్రస్తుత పరిస్థితుల్లో కరివేపాకును తినడం వల్ల కలిగే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ అంటూ సదరు సంస్థ ఒక నివేధికలో తెలియజేసింది. ఆ సంస్థ తెలియజేసిన దాని ప్రకారం మనం వాడే కరివేపాకులో దాదాపుగా సగం వరకు విషతుల్యం అయ్యిందట. ప్రమాదకర విష పదార్థాలతో కరివేపాకులను మనం అంతా నాశనం చేశాం.
ఎఫ్ ఎస్ ఎస్ ఏఐ సంస్థ ఇప్పటి వరకు ఎన్నో రకాల కూరగాల శాంపిల్స్ పై పరిశోదనలు చేశారు. వాటిలో 20 శాతం వరకు విషతుల్యం అయ్యాయని నిర్థారించింది. ఎక్కువ శాతం కూరగాలపై మరియు తృణదాణ్యాలపై పరిశోదన చేసే ఈ సంస్థ మొదటి సారి కరివేపాకు పై పరిశోదన చేసేందుకు దాదాపుగా 660 శాంపిల్స్ ను సేకరించడం జరిగింది. అందులో సగానికి పైగా విషంను కలిగి ఉన్నాయంటూ పరిశోదనలో వెళ్లడయ్యింది. కరివేపాకు చెట్లను కూడా పురుగు మందులను ఉపయోగించి పెంచుతున్నట్లుగా వెళ్లడయ్యింది. ఈ ఫలితాలు భవిష్యత్తుపై భయం కలిగిస్తున్నాయి. ముందు ముందు ప్రతీది విషతుల్యం అయ్యేలా ఉందంటూ ఆందోళన వ్యక్తం అవుతుంది.