Begin typing your search above and press return to search.
బీ రెడీ: 3 రోజుల్లో భారీ బాదుడు పక్కానట
By: Tupaki Desk | 12 Oct 2016 6:12 AM GMTమరో మూడు రోజుల్లో దేశ ప్రజల మీద భారీ భారం పడటానికి రంగం సిద్ధమవుతుందట. అందరూ అలెర్ట్ గా ఉండాల్సిన ఈ విషయం ఏమిటంటే.. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ముడిచమురు ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంత గరిష్ఠ స్థాయికి ముడి చమురు ధరలు పెరగటంతో ఆ భారం మరో మూడు రోజుల్లో దేశ ప్రజల మీద పడనుంది.
ప్రతి నెల 15.. 30 తేదీల్లో అయిల్ కంపెనీలు అంతర్జాతీయ ముడిచమురు ధరల్ని ఆధారంగా చేసుకొని పెట్రోల్.. డీజిల్ ధరల్ని నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ధరలు భారీగా తగ్గినప్పుడు ఆ తగ్గింపు ప్రజలకు తక్కువ ఉండేలా నిర్ణయం తీసుకోవటం.. ఒకవేళ ధరలు పెరిగితే.. ఆ భారం మొత్తాన్ని ప్రజల మీద బదిలీ చేయటం గడిచిన రెండున్నరేళ్లుగా సాగుతోంది.
మోడీ సర్కారు మైండ్ సెట్ తెలిసిన వారంతా.. తాజాగా పెరిగిన ముడిచమురు ధరల నేపథ్యంలో ప్రజల మీద భారం భారీగా మోపే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. ముడిచమురు ఉత్పత్తిని తగ్గిస్తూ అల్జీరియా నిర్ణయం తీసుకోవటం.. అదే బాటలో నడుస్తామని నాన్ ఓపెక్ దేశాల నుంచి వచ్చిన సంకేతాలతో సౌదీ సైతం ముడిచమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఈ ఏడాదిలోనే గరిష్ఠ స్థాయికి ముడి చమురు ధర చేరింది. తాజాగా బ్యారెల్ ముడిచమురు ధర 53.45 డాలర్లు ఉండటమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.
ముడి చమురు ఉత్పత్తి విషయంలో ఓపెక్.. నాన్ ఓపెక్ దేశాల మధ్య నడిచిన పోటీ పుణ్యమా అని బ్యారెల్ ముడిచమురు ధర 30 డాలర్ల దిగువకు పడిపోయింది. ఈ సందర్భంగా పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా తగ్గాల్సి ఉన్నప్పటికి మోడీ సర్కారు పరిమితంగా మాత్రమే ఆ ఫలాన్ని దేశ ప్రజలకు అందించింది.
ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా బ్యారెల్ ధర 53 డాలర్లకు చేరుకున్న నేపథ్యంలో ఈ నెల 15న జరిగే రివ్యూలో పెట్రోల్..డీజిల్ ధరలు ఎంత మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంటారన్నది ప్రశ్నగా మారింది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. పెట్రోల్ ధర లీటరుకు కనీసం రూ.5 మేర పెరిగే అవకాశం ఉందని.. డీజిల్ ధర లీటరుకు రూ.3 కంటే ఎక్కువ పెరిగే వీలుందని చెబుతున్నారు. కారుకు కనీసం ఇరవై లీటర్లు.. బైకుకు ఐదారు లీటర్ల చొప్పున పోయించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ముందే మీ వెహికిల్స్ పెట్రోల్ ట్యాంకుల్ని ఫుల్ చేయిస్తే.. కొంత భారం తగ్గించుకునే వీలుంది. మరి.. 15 తారీఖు ముందే ట్యాంకుల్ని ఫుల్ చేయించుకుంటే మంచిది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/