Begin typing your search above and press return to search.
రోజుకోసారి పెట్రోల్ ధరల్ని మారుస్తారట
By: Tupaki Desk | 7 April 2017 2:23 PM GMTపైత్యం ముదరటమో.. తెలివి మరింత తలకెక్కటమో కానీ.. ప్రభుత్వపరంగా తీసుకునే నిర్ణయాల విషయాల్లో అధికారుల ప్రతిపాదనలు అంతకంతకూ దారుణంగా మారుతున్నాయి. అంతర్జాతీయంగా మారే ముడిచమురు ధరల ఆధారంగా ప్రతి పదిహేను రోజులకోసారి తగ్గించటమో.. పెంచటమో చేస్తున్న అయిల్ కంపెనీలు.. తింగర ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చాయి. నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఆధారంగా ధరల్ని డిసైడ్ చేస్తున్నట్లు చెప్పినా.. కనిష్ఠ స్థాయికి ముడిచమురు ధర పడిపోయినా.. లీటరు పెట్రోల్ ధర రూ.70కు తగ్గని దరిద్రం. ఇది చాలదన్నట్లుగా.. తాజాగా తీసుకొచ్చిన ప్రతిపాదన ప్రకారం.. ప్రతి పదిహేను రోజులకు కాకుండా.. ప్రతి రోజూ ధరల్ని డిసైడ్ చేస్తే బాగుంటుందన్న మాటను చెబుతున్నారు.
అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఏ రోజుకు ఆ రోజు సమీక్షించి.. రేట్లను డిసైడ్ చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. దేశీయ రిటైల్ మార్కెట్‌ను 95 శాతం తమ అధీనంలో ఉంచుకున్న ఇండియన్ ఆయిల్ కొర్పొరేషన్.. భారత్ పెట్రోలియం.. హిందుస్తాన్ పెట్రోలియంలు ఈ దిశగా సమాలోచనలు జరుపుతున్న వ్యవహారం బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను తయారు చేసిన ఆయిల్ కంపెనీలు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో భేటీ అయ్యాయి. ఈ మార్పు వల్ల ఏ రోజు ధర ఆ రోజు ఉంటుందని.. పైసల్లో తేడా వస్తుందే తప్పించి.. పెద్దగా భారం పడదంటున్నాయి చమురు కంపెనీలు. ముగ్గులోకి దింపేటప్పుడు ఇలాంటి సోది మాటలు చెప్పటం మామూలే. రోజుకు పది పైసలు చొప్పున పెంచుకుంటూ పోయినా.. నెలకు రూ.3 లీటరకు పెంచొచ్చన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ముడిచమురు ధరలు తగ్గినప్పుడు ఏదో ఒక కారణం చూపి.. ధరల్ని ఆ స్థాయిలో తగ్గించని ఆయిల్ కంపెనీలు.. ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెర తీస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయిల్ కంపెనీల ఆరాచకానికి తలొగ్గకుండా ప్రధాని మోడీ ఈ విషయంలో జోక్యం చేసుకొని.. దేశ ప్రజలకు ఆయిల్ బాదుడు నుంచి ఉపశమనం కలిగించాల్సిన అసవరం ఉంది. లేనిపక్షంలో మోడీకి.. మౌనసింగ్ మన్మోహన్ పాలనకు పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/