Begin typing your search above and press return to search.
లింగ మార్పిడికి ఆ దేశంలో ఫుల్ డిమాండ్..!
By: Tupaki Desk | 5 Dec 2022 11:30 PM GMTసైన్స్ అండ్ టెక్నాలజీని మంచిగా వాడుకుంటే మానవళికి మంచి ఫలితాలు వస్తాయి. అదే పనిని చెడుగా వినియోగిస్తే చెడు ఫలితాలు వస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనిషి పుట్టుకను దేవుడి నిర్ణయిస్తారని అంతా భావిస్తారు. శిశువు జన్మించాకే అది ఆడో.. మగో చెప్పడం సాధ్యమవుతుంది.
అయితే ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని శిశువు పిండంగా ఉన్నప్పుడే ఆడో.. మగో తెలిసి పోతుంది. శిశువు ఆరోగ్యంగా ఉన్నాడో లేదో తెలుసుకునేందుకు వైద్యులు ఈ టెక్నాలజీ వాడుతున్నారు. అయితే ఇది కాస్త పక్కదారి పట్టడంతో గర్భస్త శిశువు(ఆడ) మరణాలు ఎక్కువగా అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే భారత్ సహా చాలా దేశాల్లో శిశువు లింగ నిర్ధారణ చేయడం నేరంగా చట్టం చేయబడింది. ఈ నిబంధనలు అతిక్రమిస్తే వైద్యుడి లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠినమైన శిక్షకు అర్హులవుతారు. అయితే కొన్నిచోట్ల మాత్రం డబ్బుకు ఆశపడే వైద్య సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు.
కాగా ఇటీవలి కాలంలో ట్రాన్స్ జెండర్స్.. స్త్రీలు లింగ మార్పిడి చికిత్సతో పురుషులు మారుతున్నారు. ఇంగ్లాండ్ లో ఈ లింగ మార్పిడికి అనుమతి ఉండటంతో చాలా మంది విదేశీయులు అక్కడి వెళ్లి మరీ లింగమార్పిడి చేయించుకుంటున్నారు. అయితే యూకేలోని న్యూ విక్టోరియా ఆస్పత్రిలో మాత్రమే ఈ సర్జరీ చేస్తున్నారు. దీంతో ఈ ఆస్పత్రికి ఫుల్ డిమాండ్ నెలకొంది.
వివిధ ప్రమాదాల్లో పురుషాంగం దెబ్బతిన్న చాలామంది పురుషులు లింగ మార్పిడితో పురుషాంగాన్ని పునర్మించే ఫాలోప్లాస్టీ సర్జరీ కోసం ఈ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. అయితే కరోనా కారణంగా సర్జరీలు చాలావరకు పెండింగ్ పడ్డాయి. ఇప్పటికే ఆస్పత్రిలో పేర్లు నమోదు చేసుకున్న వారికి సర్జరీలు చేయాలంటే నాలుగేళ్ల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
అయితే అంతా సమయం వేచి ఉండలేని ట్రాన్స్ జెండర్స్.. స్త్రీలు తమను విదేశాలకు ఫాలో ప్లాస్టీ కోసం పంపించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ హెల్త్ సర్వీస్ నిధులు కింద ట్రాన్స్ జెండర్స్ క్రౌండ్ ఫండింగ్ చేపడుతున్నారు. ఈ సర్జరీ కోసం 21 లక్షల ఖర్చు అవుతున్న నేపథ్యంలో భారీగా ఫండ్ సమకూర్చేందుకు బ్రిటన్లోని ట్రాన్సాక్చువల్ గ్రూప్ పోరాడుతోంది.
ఇక ఫాలోప్లాస్టీ చికిత్స మూడు విధాలుగా ఉండనుంది. పురుషాంగం విస్తరణ ఆపరేషన్.. పురుషాంగం పొడవు.. వెడల్పు పెంచే సర్జరీలు ఉంటాయి. వ్యక్తి శరీరంలోని ముంజేయి లేదా తొడ భాగంలో చర్మాన్ని కత్తిరించి పురుషాంగాన్ని గ్రాఫ్టింగ్ ద్వారా వైద్యులు పునర్ నిర్మిస్తారు. దీనిని సర్జరీ ద్వారా మూత్రాశయానికి జోడిస్తారు. ఆ తర్వాత రక్తనాళాలు.. నాడిని అనుసంధానం చేసి అంగస్తంభన కలిగేలా చేస్తారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.