Begin typing your search above and press return to search.
భారీ వర్షంతో హైదరాబాదీ అతలాకుతలం
By: Tupaki Desk | 9 Sep 2015 2:44 PM GMTవాన కోసం మొహం వాచిపోయిన నగరజీవి దాహం తీరేలా వర్షం కురిసింది. గత మూడు..నాలుగు రోజులుగా వర్షం కురుస్తున్నా.. బుధవారం మాత్రం హైదరాబాద్.. సికింద్రాబాద్ లలో కురిసిన భారీ వర్షంతో హైదరాబాదీ తడిచి ముద్దయ్యారు.
మధ్యాహ్నం తర్వాత మొదలైన వానజల్లు కుండపోతగా మారి.. భారీ వర్షం కురవటంతో నగరం మొత్తం వాననీటితో నిండిపోయింది. ఎప్పటిలానే వాననీరు వెళ్లేందుకు మార్గం లేక.. రోడ్ల మీద భారీగా నిలిచిపోవటంతో రోడ్లు మొత్తం తటాకాన్ని తలపించేలా మారాయి.
దీంతో.. వాహనదారులు.. రోడ్ల మీద వచ్చే వారంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రోడ్ల మీద నిలిచిపోయిన భారీ వర్షపు నీటితోవాహనాల వేగం తగ్గిపోయింది. దీంతో.. రోడ్ల మీద వాహనాలు భారీగా ఆగిపోయిన పరిస్థితి.
గతంలో మాదిరే.. భారీ వర్షంతో నాలాలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులు వర్షాలు ఇదే రీతిలో పడే అవకాశం ఉన్న నేపథ్యంలో జీహెచ్ ఎంసీ అధికారులు అలెర్ట్ అయ్యారు. సహాయక చర్యల కోసం 24 అత్యవసర బృందాల్ని సిద్ధం చేశారు. మొత్తంగా ఆలస్యంగా కురిసిన వానతో హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైన పరిస్థితి. ఇక.. హైదరాబాదీ తిప్పల గురించి ఎంత తక్కువ చెబితే అంతమంచిదన్నట్లుగా మారి.. నగర రోడ్ల మీద ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు.