Begin typing your search above and press return to search.

ఏపీలో సంక్షేమానికే ఇన్ని నిధులా?

By:  Tupaki Desk   |   10 March 2016 9:13 AM GMT
ఏపీలో సంక్షేమానికే ఇన్ని నిధులా?
X
ఏపీలో సంక్షేమానికి బోలెడన్ని నిధులు కేటాయించేసింది ఏపీ ప్రభుత్వం. వరుసబెట్టి ఆ సంక్షేమం.. ఈ సంక్షేమం అంటూ వేల కోట్లను కేటాయించేసింది. ఇలా కేటాయించేయడం వల్ల తమ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ... కొత్త ఏర్పడిన రాష్ట్రం మౌలిక సదుపాయల కల్పనలో ఎప్పుడు ముందుకు పోతుందనేది అర్థం కాని ప్రశ్న. నూతన రాజధానికి కేవలం రూ.1500 కోట్లను మాత్రమే కేటాయించింది. కేంద్రం ఎలాగూ రూ.500 కోట్లు కేటాయించింది కాబట్టి.. కనీసం రాష్ట్ర బడ్జెట్టులోనైనా దానికి మూడు రెట్లయినా కేటాయించాలని మంత్రి భావించినట్టున్నాడు. సో.. ఇక అమరావతి నిర్మాణ పనులు వేగవంతం అవుతన్నాయన్నమాట.

ఇది ఇలా వుంటే.. సంక్షేమం పేరుతో ప్రభుత్వం కేటాయించిన నిధులను పరిశీలిస్తే.. వృద్దాప్య-వితంతువుల-వికలాంగుల పింఛన్ల కోసం-2998 కోట్లు.. బి.సి.సంక్షేమానికి-8832 కోట్లు... ఎస్సీ సంక్షేమానికి-8724 కోట్లు... ఎస్టీ సంక్షేమానికి-3100 కోట్లు... బ్రాహ్మణ సంక్షేమానికి-65 కోట్లు... మహిళా సాధికారతకు-642 కోట్లు... యువత సాధికారతకు-252 కోట్లు.. మైనారిటీ సంక్షేమానికి-710 కోట్లు... కాపు సంక్షేమానికి రూ.1000 కోట్లు... ఉపాధి హామీకి రూ.4711 కోట్లు... ఇలా సంక్షేమానికే రూ.31034 కోట్లను కేటాయించేసింది. లక్షా 38 వేలా 688 కోట్ల మొత్తం బడ్జెట్టులో ఇంత పెద్ద మొత్తంలో సంక్షేమానికే కేటాయించడంతో.. ఓ రకంగా ఆయా వర్గాలు హ్యాపీగా వున్నా... ఇదే మొత్తం రాజధాని నిర్మాణానికి కేటాయిస్తే... సగం పూర్తయిపోతుంది.