Begin typing your search above and press return to search.
డీఎన్ఏ పరీక్షల తర్వాత హెలిక్యాప్టర్ మృతులకు అంత్యక్రియలు
By: Tupaki Desk | 10 Dec 2021 4:49 AM GMTత్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ తోపాటు 13మంది మరణించిన ఘటనలో మృతదేహాలకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి సహా ప్రముఖులు నివాళులర్పించారు. ఉన్నతాధికారులు, సైనికులు ఈ మృతదేహాలను విమానం నుంచి బయటకు తీసుకొచ్చారు.
శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ఢిల్లీలోని కామరాజ్ మార్గ్ లో ఉన్న బిపిన్ రావత్ ఇంటి వద్ద ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
భారత త్రివిధ దళాదిపతి బిపిన్ రావత్ తోపాటు 13మంది మరణించిన హెలికాప్టర్ ప్రమాదంపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం పార్లమెంట్ ఉభయసభల్లో చెప్పారు.
పూర్తి సైనిక లాంఛనాలతో సీడీఎస్ బిపిన్ రావత్ అంత్యక్రియలు పూర్తి చేస్తాం.. ఇతర సైన్యాధికారుల అంత్యక్రియలు కూడా తగిన సైనిక లాంఛనాలతో పూర్తి చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రస్తుతం వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రిలో విషమ పరిస్తితిలో ఉన్నారు. ఆయనను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
తమిళనాడులోని హెలిక్యాప్టర్ కూలిన ప్రదేశంలో కేవలం బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో ఇద్దరు బ్రిగేడియర్ల మృతదేహాలను మాత్రమే ఆర్మీ అధికారులు గుర్తించారు.
ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో చనిపోయిన వారిని గుర్తించడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే డీఎన్ఏ పరీక్షలు చేసి ఫలితాలు వచ్చిన తర్వాత మృతదేహాలను వారివారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.