Begin typing your search above and press return to search.
‘కరోనా’ లెక్కలు నిజమేనా? దహనాలు చూస్తుంటే అబద్ధమే అనిపిస్తోంది?
By: Tupaki Desk | 1 May 2021 4:30 AM GMTమన దేశంలో కరోనా ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే ప్రభుత్వాలు చెబుతున్న గణాంకాలు కాదు.. శ్మశానాల దగ్గర కాలుతున్న మృతదేహాలు, ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న రోగుల వివరాలు తెలుసుకుంటే చాలు. ఎందుకంటే దేశంలో కరోనా చాలా భయానకంగా ఉంది. కానీ ప్రభుత్వాలు మాత్రం లెక్కలు సరిగ్గా చెప్పడం లేదన్న ఆరోపణ వినిపిస్తోంది. ఓ శ్మశానంలో కోవిడ్ మృతదేహాలు కాలుతున్న ఓ ఫొటో ఇటీవల వైరల్ అయ్యింది. ఆ శ్మశానం కాన్పూర్ లో ఉంది. దాని పేరు భైరవ్ ఘాట్. ఈ ఫొటోను తీసింది పీటీఐకి చెందిన ఫొటో జర్నలిస్ట్ అరుణ్శర్మ. ఇంకా దేశంలోని అనేక శ్మశానాల్లో కాలుతున్న మృతదేహాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు చూస్తుంటే మనదేశం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే భైరవ్ ఘాట్ శ్మశానంలో గత గురువారం 38 చితులు మండుతున్నాయి. కానీ అక్కడి స్థానిక వైద్య అధికారులు మాత్రం గురువారం కేవలం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. దీన్ని బట్టి అధికారులు కరోనా కేసులు, మరణాలు దాస్తున్నారన్న విషయం అర్థం అవుతోంది. ఈ ఫొటో తీసిన అరుణ్ శర్మ ఏమన్నాడంటే.. ‘ నా జీవితంలో ఎన్నో విపత్కర పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. శవాలు కాలుతున్నప్పుడు వాటి నుంచి భరించలేని దుర్గంధం వస్తుంది. కానీ నేను తప్పని పరిస్థితుల్లో అక్కడ ఉండి ఫొటోలు తీసుకున్నాను. నేను 15 ఏళ్లుగా ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్నాను. ఎప్పుడూ ఇంతటి విపత్తును చూడలేదు.
ఇటీవల వరసగా ఆస్పత్రులు, శ్మశానాల దగ్గరకు వెళ్లి అక్కడి దుర్భరపరిస్థితిని చూస్తున్నాను. కొందరు ఆస్పత్రి సిబ్బంది శవాల మీద ఉన్న విలువైన నగలు, వస్తువులు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రోగి బంధువులే చెబుతున్నారు. ఇక మృతదేహాలను శ్మశానాలకు తీసుకొచ్చేందుకు రూ. వేలు వసూలు చేస్తున్నారు. ఈ ఘటన నా జీవితంలో ఎప్పటికి మరిచిపోలేను.
శ్మశానాల దగ్గర ఎంతో వేడిగా ఉంటుంది. ఆ వేడికి ఒక్కోసారి నా శరీరానికి కూడా సెగ తగిలింది.ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేయడం అవసరమా? అంటూ చాలా మంది నన్ను ప్రశ్నించారు. కానీ నా ముందు రెండే దారులున్నాయి. ఒకటి ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవడం.. రెండోది విపత్కర పరిస్థితుల్లోనూ పనిచేయడం. కానీ నేను రెండో మార్గాన్నే ఎంచుకున్నాను’ అంటూ అరుణ్ శర్మ తన అభిప్రాయాలను పంచుకున్నారు.