Begin typing your search above and press return to search.
మోడీ తప్పు చేశారంటూ తప్పులో కాలేశాడు
By: Tupaki Desk | 28 Dec 2015 9:22 AM GMTఒకరు తప్పు చేశారని చెప్పేటప్పుడు.. ఆ చెప్పేవాడు తప్పు చేయకూడదు. కానీ.. అవగాహనారాహిత్యంతో తప్పు చేసినట్లుగా గొంతు చించుకున్న సదరు టీవీ రిపోర్టర్ ఇప్పుడు నవ్వుల పాలయ్యాడు. అతగాడి వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్ లోనూ.. సోషల్ మీడియాలోనూ జోకుగా మారి పలువురికి నవ్వు తెప్పిస్తోంది. రష్యా నుంచి అప్ఘనిస్తాన్ వెళ్లి.. ఆ పై పాక్ కు సర్ ప్రైజ్ విజిట్ ఇచ్చిన ప్రధాని మోడీ పర్యటనపై పాక్ కు చెందిన సిటీ 42 అనే ఛానల్ కవర్ చేసింది.
ఈ సందర్భంగా ఆ ఛానల్ ప్రతినిధి ఖైజర్ ఖోఖర్ ఆఫీసు కార్యాలయంలోనే ఉండి వార్తల్ని వండి వార్చేశాడు. చాలా పే..ద్ద తప్పు జరిగిపోయిందంటూ అతగాడు మరింత పే...ద్ద తప్పులో కాలేయటం ఇప్పుడు నవ్వు తెప్పిస్తోంది. లాహోర్ విమానాశ్రయానికి వచ్చిన మోడీ పరివారంలో కొందరు మాత్రమే మోడీ వెంట ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్లటం తెలిసిందే. అయితే.. వీరంతా ఎలాంటి వీసాలు లేకుండా పాక్ గడ్డ మీద కాలు పెట్టేశారంటూ గగ్గోలు పెట్టేశాడు.
చాలా పెద్ద తప్పుజరిగిందంటూ వాపోయాడు. ఈ విషయాన్ని చెప్పే క్రమంలో పలుమార్లు తౌబా..తౌబా అంటూ చెవులు పట్టుకొని మరీ చెప్పటం విశేషం. పాకిస్థాన్‌లో చాలానే ఛానళ్లు ఉన్నా.. ఈ ఛానల్ విలేకరి మాత్రమే అనవసర పైత్యాన్ని ప్రదర్శించారు. ఎందుకిలా అంటే.. పాక్‌లోని లాహోర్ లో దిగిన వెంటనే.. 120 మందితో కూడిన మోడీ బృందానికి తాత్కలిక వీసాను అప్పటికప్పుడు అందజేశారు. వీరికి 72 గంటల ప్రత్యేక వీసాను ఇచ్చారు.
అయితే.. ఈ మాత్రం అవగాహన లేని సదరు రిపోర్టర్.. టీవీ ఛానల్ స్టూడియోలో ఉండి మోడీ పర్యటన గురించి మాట్లాడేశాడు. అవగాహనారాహిత్యంతో ఇతగాడి మాటలున్న వీడియో.. యూట్యూబ్ లో హడావుడి చేస్తుంది. ఇక.. ఇతగాడి మాటలపై జోకులు వేస్తూ ట్విట్టర్ లో హ్యాష్ టాగ్ ట్రెండ్ అయ్యింది.